Money Earning Tips: వాడి పడేసిన సిగరెట్ పీకలతో కూడా డబ్బులు సంపాదించొచ్చని మీకు తెలుసా..? ఈ కుర్రాడు చేస్తున్న పనేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-02-22T20:11:48+05:30 IST

కాల్చి పారేసిన సిగరెట్ పీకలు ఎందుకూ పనికి రావని అందరూ అంటారు. ఎందుకూ పనికి రాని వస్తువులను, సంపాదన లేని మనుషులను వాడి పారేసిన సిగరెట్ పీకలతో పోలుస్తుంటారు. అయితే అలాంటి సిగరెట్ పీకలతోనే ఓ వ్యక్తి డబ్బులు సంపాదిస్తున్నాడు.

Money Earning Tips: వాడి పడేసిన సిగరెట్ పీకలతో కూడా డబ్బులు సంపాదించొచ్చని మీకు తెలుసా..? ఈ కుర్రాడు చేస్తున్న పనేంటో తెలిస్తే..

కాల్చి పారేసిన సిగరెట్ పీకలు (Cigarette Butts) ఎందుకూ పనికి రావని అందరూ అంటారు. ఎందుకూ పనికి రాని వస్తువులను, సంపాదన లేని మనుషులను వాడి పారేసిన సిగరెట్ పీకలతో పోలుస్తుంటారు. అయితే అలాంటి సిగరెట్ పీకలతోనే ఓ వ్యక్తి డబ్బులు సంపాదిస్తున్నాడు (Man earns money from cigarette butts). రోడ్ల మీద పడి ఉండే సిగరెట్ పీకలను సేకరించి వాటితో బొమ్మలను, ఎరువులను తయారు చేస్తున్నాడు. అంతేకాదు మరికొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. అతని కథ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపించకమానదు (Inspirational Story).

రోడ్లపై పడి ఉండే సిగరెట్ పీకలు పర్యావరణానికి చాలా హానికరమని నోయిడాకు (Noida) చెందిన నమన్ గుప్తా గ్రహించాడుడు. ఒక సిగరెట్ పీక పూర్తిగా ప్రకృతిలో కలిసిపోవడానికి ఏకంగా 12 సంవత్సరాలు పడుతుందని తెలుసుకున్నాడు. దీంతో వాటిని రీ-సైకిల్ చేసి వస్తువులను తయారు చేయవచ్చిన గ్రహించాడు. 2018లో ఆ పని ప్రారంభించాడు. వివిధ మార్గాల్లో సిగరెట్ పీకలను సేకరించడం ప్రారంభించాడు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న స్క్రాప్ డీలర్‌లను సంప్రదించాడు. వారు సిగరెట్ పీకలను సేకరించి నోయిడాకు పంపేవారు.

cigarette1.jpg

అలా వచ్చిన సిగరెట్ పీకలను ముందు మూడు ముక్కలుగా వేరు చేస్తారు. సిగరెట్‌లో మిగిలిపోయిన పొగాకు, కాగితం, ఫైబర్‌ను వేరు చేశారు. పొగాకును ఎరువుగా ఉపయోగిస్తారు. కాగితాన్ని రీసైకిల్ చేసి, ఫైబర్‌ను ప్రాసెస్ చేసి సరికొత్త రకం పత్తిని తయారు చేస్తారు. ఆ పత్తితో మృదువైన బొమ్మలు, ఇతర కళాకృతులను తయారు చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా, రిటైల్ స్టోర్స్ ద్వారా వాటిని విక్రయిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను నోయిడాలోని ఓ ప్లాంట్‌లో చేస్తారు. నమన్‌కు వచ్చిన ఆలోచన తనకు వ్యాపారం మారడమే కాకుండా స్థానిక మహిళలకు ఉపాధి కూడా కల్పిస్తోంది.

భర్త గే అని ఆ భార్యకు డౌట్.. నిజమా..? కాదా..? అని నిర్ధారించుకునేందుకు నిఘా.. చివరకు ఆమె ఎంతవరకు వెళ్లిందంటే..

Updated Date - 2023-02-22T20:11:52+05:30 IST