Viral: అకస్మాత్తుగా రక్తవర్ణంలోకి మారిపోయిన ఆకాశం! బాబోయ్.. ఈ దృశ్యం చూసి తట్టుకోవడం కష్టమే!
ABN , First Publish Date - 2023-11-06T22:15:10+05:30 IST
బల్గేరియాలో ఆదివారం సాయంత్రం ఆకాశం అకస్మాత్తుగా రక్తవర్ణంలోకి మారడంతో జనాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: అకస్మాత్తుగా ఆకాశమంతా రక్త వర్ణంలోకి మారిపోతే ఎలా ఉంటుందో ఒక్కసారిగా ఊహించుకోండి! ప్రళయం(Apocalypse) వచ్చేసిందని అనిపించదూ? బల్గేరియా దేశంలో ఆదివారం సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో సరిగ్గా ఇలాంటి దృశ్యమే(Blood red sky in bulgaria) ఆవిష్కృతమైంది. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. అదృష్టవశాత్తూ ఇది సోషల్ మీడియా జమానా కావడంతో అనుభవజ్ఞులు కొందరు దీని గుట్టువిప్పి ప్రజల్లో టెన్షన్ తగ్గేలా చేశారు.
NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట
అకాశం ఇలా రంగు మారినట్టు కనిపించడాన్ని శాస్త్రీయ పరిభాషలో అరోరా బోరియాలిస్(Aurora Borealis) అని పిలుస్తుంటారు. సౌర తుఫాన్లతో భూమి చుట్టూ ఉన్న అయస్కాంత క్షేతం ప్రభావితమైనప్పుడు(Geomagnetic storm) వింత రంగులు కనిపిస్తాయి. భూఅయస్కాంత క్షేత్రంలో మార్పుల కారణంగా ఆకాశంలోని విద్యుదావేశం కలిగిన అణువులు క్రియాశీలకమై వివిధ రంగుల్లో కాంతి వెదజల్లుతాయి. ఫలితంగా ఆకాశం ఆకుపచ్చ, నీలం, గులాబీ, వంకాయరంగుల్లో కనిపిస్తుంటుంది. సాధారణంగా అరోరాలు ఉత్తరదక్షిణ ధ్రువాలకే పరిమితమైనప్పటికీ ఈమారు బల్గేరియాలో తొలిసారిగా ప్రత్యక్షమైంది. అందులోనూ, ఎప్పుడూ చూడని విధంగా రక్తం రంగులో ఆకాశం కనిపించడంతో స్థానికులు దిమ్మెరపోయారు.
Viral Video: బాబోయ్..భీముడు మళ్లీ పుట్టాడా? పుట్టిన వెంటనే ఈ నవజాత శిశువు చేసిన పనికి నర్సు షాక్!
కాగా, బల్గేరియాతో పాటూ రోమేనియా, హంగరీ, జెక్ రిపబ్లిక్, ఉక్రెయిన్‌లో కూడా ఆకాశం వింతకాంతుల్లో మెరిసిపోతూ కనిపించిందట. ఈ ఏడాది తొలినాళ్లల్లో భారత్‌లో లద్దాఖ్ ప్రాంత గగనతలంలోనూ తొలిసారిగా అరోరా కనిపించిన విషయం తెలిసిందే.