Viral: తొలిసారి చీర కొనుక్కునేందుకు వెళ్లిన నార్వే రాయబారి.. షాపులో సీన్ చూసి..
ABN , First Publish Date - 2023-10-22T21:32:58+05:30 IST
తొలిసారిగా చీర కొనుక్కునేందుకు వెళ్లిన నార్వే రాయబారి. అక్కడ వివిధ రకాల చీరలు చూసి ఆశ్చర్యం.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని మహిళల దుస్తుల్లో చీరలకంటే అందమైనది మరొకటి లేదని ఫ్యాషన్ నిపుణులు ఎప్పుడో తేల్చేశారు. ఇది చాలదన్నట్టు రకరకాల చీరలు, వాటిల్లోనూ రకరకాల డిజైన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంతో, షాపింగ్‌కు వెళ్లిన వారు ఎవరైనా సరే నచ్చిన చీర ఎంపిక చేసుకోవడంలో కాస్తంత తికమకపడతారు. నార్వే రాయబారి మే ఎలిన్ స్టీనర్ కూడా దాదాపు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా(Viral) మారింది.
Viral: రెండేళ్ల క్రితం ఉద్యోగం పోవడంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన పైలట్..ఇప్పుడు ఎలా ఉన్నాడంటే..
మే ఎలిన్ స్టీనర్ నార్వే రాయబారిగా వచ్చి ప్రస్తుతం ఎనిమిది వారాలు అవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో రానున్న దీపావళి పండుగ కోసం ఆమె చీరల షాపునకు వెళ్లారు. భర్తతో కలిసి ఆమె అక్కడికి వెళ్లారు. కానీ, అక్కడ బోలెడన్నీ చీరలు కనిపించే సరికి షాకైపోయారు. రకరకాల చీరలు వివిధ రకాల డిజైన్లు రంగుల్లో కనిపించే సరికి ఏది ఎంచుకోవాలో తెలీక తికమకపడ్డారు. మరోవైపు ఆమె వెంట వచ్చిన భర్త మాత్రం క్షణాల్లో తనకు నచ్చిన కుర్తాపైజామా కొనేసుకుని షాపింగ్ పూర్తి చేశారు(Norway envoy has tough time choosing saree).
H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!
Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..
దీంతో, ఆమె నాలుగు రకాల చీరలు ధరించి ఫొటోలు దిగి నెట్టింట పోస్ట్ చేశారు. ఇన్ని రంగులు, ఇన్ని రకాల డిజైన్లలో నచ్చినది ఎంపిక చేసుకోవడం నిజంగా కష్టమే. ఈ దీపావళికి తొలిసారిగా సంప్రదాయిక చీరలో కనిపించబోతున్నా. ఎరుపు రంగు చీర నాకు బాగుందని అనిపిస్తోంది. మరి మీరేమంటారు? నా భర్త మాత్రం అప్పుడే తనకు నచ్చిన కుర్తా పైజామాను ఎంపిక చేసుకున్నారు’’ అని పోస్ట్ పెట్టారు. దీంతో జనాలు రంగంలోకి దిగి నార్వే రాయబారికి రకరకాల సలహాలు ఇచ్చారు.
Youtube: 3.4 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్.. ఒక్క తప్పుతో మోనెటైజేషన్ రద్దు.. ఆమె పొరపాటు ఏంటంటే..