Train Accident: ఆ మృత్యుంజయుడు ఇతడే.. ఆ రోజు జరిగిందేనంటూ కొడుకును బతికించుకున్న ఆ తండ్రి చెబుతున్న మాటలివీ..!
ABN , First Publish Date - 2023-06-07T15:17:17+05:30 IST
ఒడిశా రైలు దుర్ఘటన ఇప్పట్లో మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. భారత రైల్వే చరిత్రలోని అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోయారు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు కోల్పోయిన వారి సంఖ్య వందల్లో ఉంది.
ఒడిశా రైలు దుర్ఘటన (Odisha Train Accident) ఇప్పట్లో మర్చిపోలేని విషాదాన్ని మిగిల్చింది. భారత రైల్వే (Indian Railways)చరిత్రలోని అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో దాదాపు 280 మంది ప్రాణాలు కోల్పోయారు. కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలు కోల్పోయిన వారి సంఖ్య వందల్లో ఉంది. ఇంతటి మహా విషాదంలో కోల్‌కతాకు (Kolkata) చెందిన ఓ కుర్రాడి కథ ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. కోల్‌కతాకు చెందిన విశ్వజిత్ మాలిక్ కోరమాండల్ రైలు (Coromandel Express) ఎక్కి ఆ ప్రమాదంలో చిక్కుకున్నాడు. తీవ్ర గాయాల పాలై స్పృహ కోల్పోయాడు.
విశ్వజీత్ కూడా చనిపోయాడని భావించి అతడి శరీరాన్ని బహనాగా హైస్కూల్‌లో మృతదేహాల మధ్య పడేశారు. అయితే తన కొడుకు చనిపోయి ఉండడని భావించిన విశ్వజీత్ తండ్రి హోలారామ్ కోల్‌కతా నుంచి బాలాసోర్ (Balasore)కు వెళ్లాడు. అక్కడ మృతదేహాల మధ్య ప్రాణాలతో ఉన్న తన కొడుకును గుర్తించి హాస్పిటల్‌లో చేర్పించాడు (Person lying alive among the dead bodies). ఈ కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ నాటి ఘటన గురించి హోలారామ్ తాజాగా మాట్లాడారు. ``దాదాపు రెండేళ్ల తర్వాత నా కొడుకు ఇంటికి వచ్చాడు. 15 రోజులు మాతో పాటు సంతోషంగా గడిపి తిరిగి పని కోసం బయల్దేరాడు.
Odisha Train Accident: చనిపోయాడని 24 ఏళ్ల కుర్రాడిని మార్చురీలో పడేస్తే.. వెతుక్కుంటూ వచ్చిన తండ్రి బతికించుకున్నాడు..!
శుక్రవారం రాత్రి ప్రమాదం గురించి తెలిసింది. అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై రాలేదు. దీంతో ఆ ప్రమాదంలో విశ్వజీత్ కూడా మరణించి ఉంటాడని మా కుటుంబ సభ్యులు, బంధువులు అనుకున్నారు. చనిపోయాడని నిర్ధారించుకుని సమాధి ఎక్కడ కట్టాలనే విషయం గురించి చర్చించుకున్నారు. కానీ, విశ్వజీత్ బతికే ఉంటాడని నాకు నమ్మకంగా ఉండేది. దాంతో మా వాళ్లను తీసుకుని బాలాసోర్ వెళ్లి అక్కడి హాస్పిటల్స్ అన్నీ వెతికాను. చివరకు బహనాగా హైస్కూల్‌లో మృతదేహాల మధ్య నా కొడుకు పడి ఉన్నాడు. అప్పుడే స్పృహలోకి వచ్చాడు. ``నేను బతికే ఉన్నా``అంటూ చేయి ఊపుతున్నాడ``ని హోలారామ్ తెలిపారు.