Daughter: కొడుకు పెళ్లి గ్రాండ్‌గా చేయడం కోసం కూతురిని మోసం చేసిన తల్లిదండ్రులు.. ఆ యువతి ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2023-03-26T18:26:33+05:30 IST

ఇద్దరూ తమ కడుపున పుట్టిన పిల్లలే అయినా ఆడ పిల్ల (Daughter), మగ పిల్లాడి (Son) పెంపకం విషయంలో కొందరు తల్లిదండ్రులు (Parents) పక్షపాతం చూపిస్తారు.

Daughter: కొడుకు పెళ్లి గ్రాండ్‌గా చేయడం కోసం కూతురిని మోసం చేసిన తల్లిదండ్రులు.. ఆ యువతి ఏం చేసిందంటే..

ఇద్దరూ తమ కడుపున పుట్టిన పిల్లలే అయినా ఆడ పిల్ల (Daughter), మగ పిల్లాడి (Son) పెంపకం విషయంలో కొందరు తల్లిదండ్రులు (Parents) పక్షపాతం చూపిస్తారు. ఆడపిల్ల విషయంలో వివక్ష చూపించి మగపిల్లాడు అడిగినవన్నీ కొనిస్తారు. చదువు విషయంలో కూడా ఆడపిల్లను వెనకే ఉంచుతారు. కొడుకు పెళ్లి గ్రాండ్‌గా చేయడం కోసం తన డబ్బులను వాడేసిన తల్లిదండ్రులపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆమె తన కథను Redditలో పోస్ట్ చేసింది (Daughter sues parents).

ఆమె చెబుతున్న దాని ప్రకారం.. ఆ యువతి చదువు కోసం ఆమె మేనత్త కొంత డబ్బులను కేటాయించి వాటిని ఆమె తల్లిదండ్రుల ఖాతాలో వేసింది. లండన్‌లో చదువుకోవాలనుకున్న ఆ యువతి ఇటీవల ఆ ఖాతాను చెక్ చేసినపుడు అందులో కేవలం $13,000 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆరా తీస్తే తల్లిదండ్రులు ఆ డబ్బులను తనకు తెలియకుండా తీసుకుని సోదరుడి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించారని తెలుసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి తన తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిపై ఛీటింగ్ కేసు పెట్టింది.

Mobile Phone: మొబైల్ కోసం కుర్రాడు ఎంతకి తెగించాడంటే.. ఫోన్ వాడొద్దన్నందుకు మామయ్యపై దాడికి దిగి దారుణం..

తమపై కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న తల్లిదండ్రులు షాకయ్యారు. తన పెళ్లికి అయిన మొత్తం డబ్బును తిరిగి ఇచ్చేయడానికి ఆమె సోదరుడు ముందుకు వచ్చాడు. అయినా ఆ యువతి మాత్రం చట్టపరంగా ముందుకు వెళ్లేందుకే నిర్ణయించుకుంది. తన నిర్ణయం చాలా మంది తల్లిదండ్రులకు గుణపాఠంగా మిగలాలని ఆమె కోరుకుంటోంది.

Viral Video: పాములకు కూడా ఇంతలా దాహం వేస్తుందా? గ్లాసులో తల పెట్టి మరీ ఆ పాము నీళ్లు ఎలా తాగిందో చూడండి..

Updated Date - 2023-03-26T18:26:33+05:30 IST