Pathaan: 'బాహుబలి' ని కిందకి నెట్టిన షారుఖ్ ఖాన్
ABN , First Publish Date - 2023-03-03T18:04:18+05:30 IST
సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం లో వచ్చిన షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఆరు సంవత్సరాల 'బాహుబలి 2' (Baahubali 2) రికార్డు ను బద్దలుకొట్టింది.
చాలా సంవత్సరాల తరువాత ఒక హిందీ సినిమా, అది కూడా పెద్ద స్టార్ అయిన షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కథానాయకుడిగా వచ్చిన 'పఠాన్' (Pathaan) విజయం సాధించి బాలీవుడ్ కి ఊపిరి పోసింది. 'పఠాన్' (Pathaan) ఇప్పుడు బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టి, తిరగరాస్తోంది. షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్ షా అని మరోసారి నిరూపించుకున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) దర్శకత్వం లో వచ్చిన షారుఖ్ ఖాన్ 'పఠాన్' ఆరు సంవత్సరాల 'బాహుబలి 2' (Baahubali 2) రికార్డు ను బద్దలుకొట్టింది. రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వం లో ప్రభాస్ (Prabhas) నటించిన 'బాహుబలి 2' ఏప్రిల్ 28, 2017 లో విడుదల అయి మొత్తం రూపాయలు 510.99 కోట్ల నెట్ ను కలెక్టు చేసింది.
ఆరేళ్ళ తరువాత ఇప్పుడు 'పఠాన్' సినిమా బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ (Deepika Padukone) నటించిన ఈ సినిమా ఇప్పుడు రూపాయలు 511.42 కోట్ల నెట్ కలెక్టు చేసి 'బాహుబలి' కన్నా ఎక్కువ సాధించిన హిందీ సినిమాగా మొదటి స్థానం (Pathaan is in Number one position) లో నిలించింది. బాలీవుడ్ లో ఇప్పుడు అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు, సాంఘీక మాధ్యమాల్లో ఇదే వైరల్ గా మారింది. ఎందుకంటే ఇంత వరకు బాలీవుడ్ (Bollywood), హాలీవుడ్ లో కూడా దక్షిణ భారత సినిమాలే (South Cinema) తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాలీవుడ్ బాగా వెనుకపడిపోయింది. దక్షిణ భారత దేశ సినిమాలనే బాలీవుడ్ వాళ్ళు ఈమధ్య రీమేక్ చేసి విడుదల చేశారు. అయినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడు 'పఠాన్' ఎప్పుడయితే 'బాహుబలి 2' రికార్డ్ ను అధిగమించిందో, ఇంకా బాలీవుడ్ లో ఆనందానికి అవధులు లేవు.
దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కూడా ఈ ఆనందాన్ని, ట్వీట్ రూపం లో పంచుకున్నాడు. అలాగే చాలామంది ఈ విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో పెడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 'బాహుబలి 2' 500 కోట్లు దాటడానికి 34 రోజులు పడితే, 'పఠాన్' సినిమా కేవలం 28 రోజుల్లోనే 500 కోట్లు దాటిందని కూడా పెడుతున్నారు. ఒక్క ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా 'పఠాన్' దే పైచేయి అయిపొయింది. ఏమైనా చాల సంవత్సరాల తరువాత ఒక హిందీ సినిమా ఇంత పెద్ద విజయం సాధించటం మంచిదే.