Love Today: బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సౌత్ సెన్సేషనల్ మూవీ

ABN , First Publish Date - 2023-02-20T16:24:32+05:30 IST

కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘లవ్ టుడే’ (Love Today). ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇవానా (Ivana) హీరోయిన్‌గా నటించారు. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించింది.

Love Today: బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న సౌత్ సెన్సేషనల్ మూవీ

కోలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘లవ్ టుడే’ (Love Today). ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఇవానా (Ivana) హీరోయిన్‌గా నటించారు. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందించింది. రూ. 7కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ మూవీ అనంతరం తెలుగు, కన్నడ, మలయాళంలోకి డబ్ అయింది. విడుదలైన ప్రతి చోట భారీ విజయాన్ని అందుకుంది. టాలీవుడ్‌లో ఈ చిత్రం అదే టైటిల్‌తో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద రూ.11కోట్లకు పైగా కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. ఈ మూవీ బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. మేకర్స్ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను జారీ చేశారు.

‘లవ్ టుడే’ హిందీ రీమేక్ రైట్స్‌ను ఫాంటమ్ స్టూడియోస్ సొంతం చేసుకుంది. ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలసి ఆ స్టూడియో సినిమాను బాలీవుడ్‌లో నిర్మించనుంది. హిందీ రీమేక్‌ను 2024 ప్రారంభంలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. అయితే, బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి. ‘దృశ్యం’ రీమేక్‌ను మినహాయిస్తే ఎంత మంచి చిత్రం అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పరాజయం పాలయింది. ‘జెర్సి’, ‘హిట్’, ‘షెహజాదా’ మూవీస్ ఈ విధంగానే బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. మరి ‘లవ్ టుడే’ హిట్ అవుతుందో లేదో తెలియాలంటే 2024 వరకు వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-02-20T16:24:34+05:30 IST