Viral: ఇలాంటోళ్లను ఏమనాలి! రైల్లో అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ఏంచేశాడో మీరే చూడండి!
ABN , Publish Date - Dec 26 , 2023 | 06:54 PM
రైల్లో సీటు ముందున్న ఫుడ్ ట్రేపై కాళ్లుపెట్టుకుని నిద్రపోయిన ప్యాసింజర్, రైల్వే అధికారి ఆగ్రహం.
ఇంటర్నెట్ డెస్క్: రైలు సర్వీసుల్లో సేవాలోపంపై ప్రజలు ఫిర్యాదు చేయడం కామన్. కానీ ఈమారు ఓ ప్రయాణికుడి తీరుతో రైల్వే అధికారి విసిగిపోయి చివరకు నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు. @Namma Kovai హ్యాండిల్‌లో తొలుత ఓ యూజర్ ఈ ఉదంతాన్ని షేర్ చేశారు. ఇది ఓ ప్రయాణికుడి ఫొటో. ఇందులో ఓ ప్యాసింజర్ దర్జాగా తన సీటు ముందున్న డైనింగ్ ట్రే మీద కాళ్లు పెట్టుకుని మరీ గుర్రుకొట్టి నిద్రపోడాడు (Railway passenger sleeps with feet on food tray). ఆ ట్రేని తినుబండారాలు ఇతర సామాన్లు పెట్టుకునేందుకు వాడతారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం తనను అందరూ చూస్తున్నారన్న సోయ కూడా లేకుండా ట్రేపై కాళ్లుపెట్టుకుని హ్యాపీగా కునుకు తీశాడు.
ఈ ఫొటోను షేర్ చేసిన యుజర్ సదరు ప్యాసింజర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇలాంటి పనులు అమర్యాదకరమైనవే కాకుండా, చుట్టూ ఉన్నవారందరిపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. తినుబండారాలు, పానీయాలు పెట్టుకునేందకు వాడే ట్రేని ఇలా అపరిశుభ్రంగా మార్చడం పద్ధతి కాదు. ఇలా చేసే వాళ్లకు కనీస మర్యాదలు కూడా తెలీవని అనిపిస్తుంది’’ అని మండిపడ్డారు.
ఈ ఉదంతంపై రైల్వే అధికారి అనంత్ రూపనాగుడి కూడా స్పందించారు. ‘‘రైల్లో ఉండే ప్రతి వస్తువును ఓ ప్రత్యేక అవసరం కోసం ఏర్పాటు చేస్తారు. వాటిని ఆయా అవసరాల కోసమే వాడుకోవాలి. రైలు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మన డబ్బుతోనే ఆ సౌకర్యాలు కల్పించారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎంతో ఖర్చుతో ఈ రైళ్లను తయార చేస్తారు. కాబట్టి, బాధ్యతగా నడుచుకోండి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు, నెటిజన్లు కూడా సదరు ప్రయాణికుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ‘‘పబ్లిక్‌లో ఉన్నామన్న సోయ కూడా లేకుండా ఇష్టారీతిన వ్యవహరించే వారిని ఏమనాలో’’ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.