Raj and DK: వెబ్ సిరీస్‌లో స్పై యూనివర్స్!
ABN , First Publish Date - 2023-02-10T19:02:05+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మూవీ ప్రాంచైజీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe). ఈ యూనివర్స్ బాక్సాఫీస్ వద్ద బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన మూవీ ప్రాంచైజీ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (Marvel Cinematic Universe). ఈ యూనివర్స్ బాక్సాఫీస్ వద్ద బిలియన్ డాలర్స్ వసూళ్లను రాబట్టింది. ఫలితంగా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇటువంటి ప్రాంచైజీ/యూనివర్స్‌లను క్రియేట్ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. రోహిత్ శెట్టి, లోకేశ్ కనక రాజ్, శైలేశ్ కొలను ఇటువంటి వాటిని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు యూనివర్స్‌లను సినిమాల్లోనే క్రియేట్ చేస్తుండగా ఈ ట్రెండ్ వెబ్‌సిరీస్‌ల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ రాజ్ అండ్ డీకే (Raj and DK) స్పై యూనివర్స్‌ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే అటువైపు అడుగులు వేశారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్’ (The Family Man) వెబ్‌సిరీస్‌తో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్న మేకర్స్ రాజ్ అండ్ డీకే (Raj and DK). ఈ షో రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరిని అమితంగా ఆకట్టుకుంది. తాజాగా వీరు ‘ఫర్జీ’ (Farzi)ని రూపొందించారు. ఈ వెబ్‌సిరీస్‌తో కొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు. స్పై యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నారు. ‘ఫర్జీ’ లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ కు సంబంధించిన లింక్ పెట్టారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ లో కనిపించిన ఛెల్లం పాత్ర తాజాగా ‘ఫర్జీ’ లోను కనిపించింది. ఛెల్లం సార్‌తో విజయ్ సేతుపతి ఫోన్ కాల్ మాట్లాడే సీన్ ‘ఫర్జీ’ లో ఉంది. ఒకే పాత్రను రెండు వెబ్ సిరీస్‌ల్లో ఉపయోగించుకోని స్పై యూనివర్స్ వైపు అడుగులేశారు. రాజ్ అండ్ డీకే ప్రస్తుతం ‘సిటాడెల్’ (Citadel)ను తెరకెక్కిస్తున్నారు. ఈ షోలో కూడా ఇతర వెబ్‌సిరీస్‌లకు సంబంధించిన పాత్రలను ఏమైనా ఉపయోగించుకుంటారా లేదా అనేది తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక ‘ఫర్జీ’ విషయానికి వస్తే.. షాహిద్ కపూర్, విజయ సేతుపతి, రాశీ ఖన్నా, కావ్య థాపర్, అమోల్ పాలేకర్ తదితరులు ఈ షోలో కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 10న విడుదల అయిన ఈ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల మెప్పును పొందుతోంది. ‘సిటాడెల్’ లో వరుణ్ ధావన్, సమంత గూఢచారులుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఈ మధ్యనే పట్టాలెక్కింది. ‘అవెంజర్స్’ ఫేమ్ రుస్సో బ్రదర్స్ నిర్మిస్తున్నారు.