Rakul Preet Singh: చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు!
ABN , First Publish Date - 2023-02-28T00:27:29+05:30 IST
‘కొండపొలం’ (Kondapolam)పరాజయం తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు రకుల్‌ప్రీత్ సింగ్(Rakul Preet Singh). బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గత ఏడాది ఆమె నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదలయ్యాయి.
‘కొండపొలం’ (Kondapolam)పరాజయం తర్వాత తెలుగులో మరో సినిమాకు సైన్ చేయలేదు రకుల్‌ప్రీత్ సింగ్(Rakul Preet Singh). బాలీవుడ్‌లో మాత్రం వరుస సినిమాలతో బిజీ అయ్యారు. గత ఏడాది ఆమె నటించిన ఐదు హిందీ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్–2’(indian2), ‘అయలాన్’ చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కెరీర్ పరంగా చాలా ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చారు రకుల్. ఆమె మాట్లాడుతూ ‘‘దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో ఇప్పటి వరకూ విభిన్నమైన పాత్రలు పోషించా. ఆ అవకాశాలు ఇచ్చిన దర్శకనిర్మాతలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఒక సినిమా సక్సెస్ ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. కానీ సక్సెస్‌ని తేల్చి చెప్పేది ప్రేక్షకులే’’ అని అన్నారు. (Rakul comments on inDIan cinema)
ఉత్తరాది, దక్షిణాది చిత్రాల మధ్య పోటీ గురించి జరుగుతున్న చర్చ విషయమై రకుల్ మాట్లాడారు. ‘‘ఈ టాపిక్ గురించి అందరూ సోషల్ మీడియాలో మాట్లాడుతూ చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపిస్తున్నారు. హిందీ, ప్రాంతీయ చిత్రాలు రెండు భారత సినిమాలో భాగమే! కాబట్టి వాటిని ఒకదానితో ఒకటి పోల్చడం సరైనది కాదు. మంచి సినిమాను వస్తే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకు ఈ మధ్యన వచ్చిన ఎన్నో చిత్రాలు నిదర్శనం. మన దగ్గర గొప్ప ఆలోచనలు, ప్రతిభ ఉన్న దర్శకులున్నారు. వారంతా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా తర్వాత ఓటీటీకు ఆదరణ పెరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఏ ప్లాట్‌ఫామ్‌లో విడుదల అన్నది ముఖ్యం కాదు. కంటెంట్ అందులో ఎమోషన్ ముఖ్యం. సినిమా బావుంటే థియేటర్, ఓటీటీ ఎక్కడైనా చూస్తారు. ఇటీవల విడుదలైన చాలా చిత్రాలు ఓటీటీలో చక్కని ఆదరణ పొందాయి’’ అని అన్నారు.