Ramya Raghupathi: నరేష్, పవిత్రల పెళ్లి జరగనివ్వను
ABN , First Publish Date - 2023-01-05T19:04:12+05:30 IST
ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)ల పెళ్లి జరగనివ్వనని అన్నారు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవిత్రతో ఉన్న ఓ వీడియోని నరేష్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో నటి పవిత్రను..
ఎట్టి పరిస్థితుల్లోనూ నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)ల పెళ్లి జరగనివ్వనని అన్నారు నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పవిత్రతో ఉన్న ఓ వీడియోని నరేష్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో నటి పవిత్రను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పడమే కాకుండా.. అందరి ఆశీస్సులు కావాలని నరేష్ కోరాడు. అంతేకాదు, ఈ వీడియోలో పవిత్రతో ఆయన లిప్‌లాక్ కూడా చేశాడు. ఈ వీడియోపై ఏ రేంజ్‌లో వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. పవిత్రను పెళ్లి చేసుకుంటే.. నరేష్‌కు అది నాల్గవ పెళ్లి (Naresh 4th Marriage) అవుతుంది. అయితే అంతకు ముందు నరేష్ చేసుకున్న మూడో పెళ్లి నిమిత్తం.. ఆయనకి ఇంకా విడాకులు రాలేదు. మూడో వివాహంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రఘువీరారెడ్డి (Raghuveera Reddy) సోదరుడి కుమార్తె రమ్య రఘుపతి (Ramya Raghupathi)ని 2010లో వివాహం (Naresh 3rd Marriage) చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ పై రమ్య రఘుపతి సంచలన కామెంట్స్ చేసింది. ఏది ఏమైనా సరే.. నరేష్‌కి మాత్రం విడాకులు ఇవ్వడం జరగదని ఆమె తేల్చి చెప్పింది. ఇంకా నరేష్ ప్రవర్తనకి సంబంధించిన అనేక విషయాలను ఆమె బయటపెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘నన్ను వదిలించుకోవడానికి నరేష్ దారుణాతి దారుణాలు చేశాడు. ముఖ్యంగా దేవుడులాంటి కృష్ణ (Super Star Krishna)గారితో నాకు అక్రమ సంబంధం అంటగట్టాడు. నా నుంచి కృష్ణగారికి ప్రాణ హాని ఉందని.. కృష్ణగారు రాసినట్లుగా ఓ లెటర్ రాసి.. కృష్ణగారి సంతకాన్ని నరేష్ ఫోర్జరీ చేశాడు. ఆ లెటర్‌తో నాపై కేసు వేయించాడు. ఈ విషయం కృష్ణగారికి కూడా తెలియదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే కృష్ణగారిపై ఉన్న మర్యాద, ఆయన పేరు ప్రతిష్టలు బజారున పడేయడం ఇష్టంలేకే ఇన్నాళ్లు ఈ విషయం బయటపెట్టలేదు. కానీ నరేష్ దారుణాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. పవిత్రను తొలిసారి నాకు పరిచయం చేసినప్పుడు.. నా చేత్తో ఆమెకి అన్నం పెట్టాను. ఇప్పుడామె నరేష్‌తో కలిసి నాకు సున్నం పెట్టాలని చూస్తుంది. ఏది ఏమైనా వారిద్దరి పెళ్లి మాత్రం జరగనివ్వను. నా కుమారుడు నాన్న కావాలని అంటున్నాడు. కాబట్టి నరేష్‌కి విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు’’ అంటూ రమ్య రఘుపతి ఘాటుగా స్పందించింది.