Valentine’s Day: రానా భార్య మిహీకా బజాజ్ పోస్ట్ వైరల్

ABN , First Publish Date - 2023-02-14T20:52:26+05:30 IST

ప్రేమికుల రోజు (Valentine’s Day) సందర్భంగా రానా దగ్గుబాటి (Rana Daggubati) భార్య మిహీకా బజాజ్ (Miheeka Bajaj) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సరదాగా అంటూనే

Valentine’s Day: రానా భార్య మిహీకా బజాజ్ పోస్ట్ వైరల్
Rana Daggubati and Miheeka Bajaj

ప్రేమికుల రోజు (Valentine’s Day) సందర్భంగా రానా దగ్గుబాటి (Rana Daggubati) భార్య మిహీకా బజాజ్ (Miheeka Bajaj) చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. సరదాగా అంటూనే.. తనలోని ప్రేమను ఆమె బయటపెట్టింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమె చేసిన ఈ పోస్ట్.. టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా వైరల్ అవుతోంది. ఇంతకీ మిహీకా ఏం పోస్ట్ చేసిందంటే..

‘‘నేను చాలా స్ట్రాంగ్ మరియు స్వీట్.. అందమైన మరియు అద్భుతమైన దానిని.. ఇంకా నా గురించి చెప్పడానికి ఎటువంటి పదాలు సరిపోవు. అలాంటి నన్ను నువ్వు ప్రేమించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు..

ఊరికే సరదాగా అంటున్నాను అంతే.

నీ వర్క్ నిమిత్తం నాకు నువ్వు దూరంగా ఉన్నప్పుడు నేను బాధ పడినా.. కానీ నీ నవ్వు నన్ను మళ్లీ నీతో ప్రేమలో పడేలా చేస్తుంది.. హ్యాపీ వాలెంటైన్స్ డే’ అంటూ లవ్ ఎమోజీతో తన కలల మనిషి రానాకు మిహీకా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపింది. (Miheeka Bajaj Valentine’s Day Greetings)

Miheeka.jpg

మిహీకా చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా అందంగా శుభాకాంక్షలు తెలిపారంటూ.. ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇంత అందంగా మరెవ్వరూ చెప్పలేరు అంటూ మరికొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతుండటం విశేషం. మొత్తంగా అయితే.. ప్రేమికుల రోజున చేసిన ఒక్క పోస్ట్‌తో అటు భర్త ప్రేమని.. ఇటు నెటిజన్ల అటెన్షన్‌ని మిహీకా దగ్గుబాటి (Miheeka Daggubati) బాగానే రాబట్టుకుందని చెప్పొచ్చు. కాగా, ఇటీవల రానా, మిహీకా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు కూడా మిహీకా చాలా చక్కగా క్లారిటీ ఇచ్చి.. మళ్లీ ఆ వార్తలు పునరావృతం కాకుండా చేసింది. (Miheeka and Rana Daggubati)

Updated Date - 2023-02-14T21:00:20+05:30 IST