Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

ABN , First Publish Date - 2023-03-01T15:20:06+05:30 IST

ఓ యువకుడు నడిరోడ్డుపై ప్రేయసి చెంప మీద కొట్టడం.. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) అతనితో గొడవకు దిగడం తెలిసిందే.

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు
Rashmi Gautam

ఓ యువకుడు నడిరోడ్డుపై ప్రేయసి చెంప మీద కొట్టడం.. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య (Naga Shaurya) అతనితో గొడవకు దిగడం తెలిసిందే. రోడ్డు మీద ఓ యువకుడు తన ప్రేయసిని కొట్టడం కారులో వెళుతున్న నాగశౌర్య చూశాడు. దీంతో ఆ యువకుడి దగ్గరకి వెళ్లి ఆ అమ్మాయికి స్వారీ చెప్పమని శౌర్య వాగ్వాదానికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. దీంతో ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ నాగశౌర్యని విమర్శించడం మొదలుపెట్టారు. (viral video)

Add.jpg

‘లవర్స్ మధ్య వంద గొడవలు ఉంటాయి. ఇప్పుడు అది గెలకడం అవసరమా. కొట్టేడం తప్పే కానీ.. ఈ విషయం ఆ అమ్మాయి వల్ల తల్లిదండ్రులకి తెలిస్తే పరిస్థితి ఏంటి. ఇకపై ఆ అమ్మాయికి అన్ని టెన్షన్లే’.. ‘ప్రతి వాడు ఎక్కువ చేస్తున్నాడు. వాడి గర్ల్‌ఫ్రెండ్ వాడి ఇష్టం. ఆ అమ్మాయికి ఏం సమస్య లేనప్పుడు ఇతనికి ఎందుకు.. ఆమె ఏం తప్పు చేసిందో ఎవరికీ తెలుసు. ఇదే ఒక అబ్బాయికి జరిగితే ఇలాగే అంటారా’.. ‘వాడి లవర్‌ని వాడు కొట్టుకుంటే.. ఇతనికేం సమస్య’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేశారు.

అయితే, ఈ విషయంలో నాగశౌర్య చేసింది సరైనదేనంటూ రష్మి గౌతమ్ (Rashmi Gautam) సపోర్టు చేసింది. ఈ కామెంట్స్ అన్నింటినీ షేర్ చేస్తూ ఓ పోస్ట్‌ చేసింది. అందులో.. ‘వాడి లవర్ వాడి ఇష్టం అంట. అమ్మాయే సపోర్టు చేస్తుందంట. ఈ కామెంట్స్ చాలా దారుణం. ఆ అమ్మాయిని పరిస్థితి గురించి ఎవరికీ తెలుసు. మరో ఆత్మహత్య జరిగే వరకూ చూస్తుంటారా’ అని తనదైన శైలిలో ఘాటుగా స్పందించింది.

ఇవి కూడా చదవండి:

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

Madhuri Dixit: ‘ఆయనతో పెళ్లి చాలా కష్టం అనిపించింది.. అందుకే భాగస్వామి గురించి ముందే తెలుసుకోవాలి’

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-01T15:41:12+05:30 IST