Reserve Bank: కరెన్సీ నోట్ల గురించి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిర్ణయం.. ఈ పొరపాటు ఎప్పుడూ చేయకండి..

ABN , First Publish Date - 2023-01-10T16:26:32+05:30 IST

ఈ మార్గదర్శకాల ప్రకారం కరెన్సీ విషయంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది..

Reserve Bank: కరెన్సీ నోట్ల గురించి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిర్ణయం.. ఈ పొరపాటు  ఎప్పుడూ చేయకండి..

రిజర్వ్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాలు ఎప్పటికప్పుడు ఆసక్తిగా ఉంటాయి. కొత్త నోట్ల ముద్రణ, కరెన్సీ విషయంలో కొత్త నిబంధనలు ఇలా.. అయితే రిజర్వ్ బ్యాంక్ తాజాగా తన వెబ్సైట్ లో కరెన్సీ నోట్ల గురించి కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. దాని గురించి వివరంగా తెలుసుకుంటే..

చాలా మంది కరెన్సీ నోట్లు లెక్కపెట్టేటప్పుడు ఎన్ని నోట్లు ఉన్నాయో గుర్తుపెట్టుకోవడానికి నోట్ల మీద నంబర్స్ వేస్తుంటారు, మరికొందరు కరెన్సీ నోట్ల మీద పేర్లు ఇతర వేరే విషయాలు రాస్తుంటారు. అయితే రిజర్వ్ బ్యాంక్ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం కొత్త కరెన్సీ నోట్ల పైన ఏదైనా రాసినా, సంతకాలు వంటివి చేసినా అవి చెల్లవని పేర్కొంది. ఇది ఎప్పటినుండో అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ మధ్య కాలంలో కొత్తనోట్ల ముద్రణ జరిగిన తరువాత పాత నోట్ల విషయంలో జరిగిన నష్టం పునావృతం కాకుండా ఉండాలంటే కొత్త నోట్లను శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యమనే కారణంతో 'క్లీన్ నోట్ పాలసీ' పేరుతో ఓ కొత్త నిబంధనను కూడా ప్రవేశపెట్టింది. దీన్ని అనుసరించే నోట్ల మీద ఏదైనా రాయడం చేయకూడదు. నోట్ల మీద ఏదైనా రాస్తే నోట్ల జీవితకాలం తగ్గిపోతుందట. అందుకే ఈ నిబంధన తెచ్చినట్టు చెప్పారు.

ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ హై-ఎడ్ స్పీడ్ కరెన్సీ వెరిఫికేషన్ అండ్ ప్రాసెసింగ్ సిస్టం మెషీన్లను తమ అన్ని బ్రాంచులలో ఇన్స్టాల్ చేసింది. దీని సహాయంతో నోట్లను గంటకు 50వేల నుండి 60వేల ముక్కలుగా చేసే వెసులుబాటు ఉంటుంది. దీని వల్ల చెల్లని నోట్లను ఆన్లైన్ లోనే క్లియర్ చేసేస్తుంది. ఏది ఏమైనా పొరపాటునో.. అత్యవసరమనే కారణంతోనో నోట్లపైన ఏమీ రాయకండి. రాస్తే అది ఎందుకూ పనికి రాకుండా పోతుంది జాగ్రత్త.

Updated Date - 2023-01-10T16:26:44+05:30 IST