Sachin: అభిమానులను కదిలిస్తున్న సచిన్ కామెంట్స్! నెట్టింట పాత ఫొటో విపరీతంగా వైరల్!
ABN , First Publish Date - 2023-11-03T22:05:26+05:30 IST
సచిన్ షేర్ చేసిన తన చిన్ననాటి ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి పదేళ్లు గడుస్తున్నా అభిమానుల మనసుల్లో సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) స్థానం చెక్కుచెదరలేదు. అంతేకాదు, అప్పట్లో సచిన్ నెలకొల్పిన రికార్డుల్లో అనేకం ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే క్రికెట్‌పై సచిన్ ముద్ర ఎంతటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే, సచిన్‌కు క్రికెట్ దేవుడనే అరుదైన గుర్తింపు లభించింది. ఇటీవల ముంబైలోని వాంఖడే స్టేడియంలో(Wankhede stadium) సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎంతో పాటూ పలువురు రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన సచిన్‌కు తను తొలి అడుగులు వేసిన క్రీడామైదానంలోనే తన విగ్రహాన్ని చూసుకునే అరుదైన గౌరవం దక్కింది.
Hacking: మీ స్మార్ట్ ఫోన్ హ్యాకైందని డౌటా? ఇలా చేస్తే కేవలం 30 సెకెన్లలోనే..
అయితే, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సచిన్ తాజాగా షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తనకు పదేళ్ల వయసున్నప్పుడు దిగిన ఫొటో అది. నాటి నుంచి నేటి వరకూ తన ప్రయాణం, వాంఖడే స్టేడియంతో ఉన్న అనుబంధం గురించి సచిన్ పెట్టిన పోస్టు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
‘‘అప్పట్లో నా వయసు జస్ట్ 10 ఏళ్లు. 25 మంది గాను చేతిలో 24 టిక్కెట్లే ఉండటంతో స్టేడియంలోని నార్త్ స్టాండ్‌లోకి గుట్టుచప్పుడు వెళ్లిన నాటి నుంచి ఈ రోజు అదే స్టేడియంలో నా విగ్రహావిష్కరణ వరకూ చూస్తే లైఫ్ ఎక్కడ మొదలైందో అక్కడికే చేరుకున్నట్టు అనిపిస్తోంది. నాటి సరదా రోజులు నాకిప్పటికీ గుర్తున్నాయి. అప్పట్లో మేమందరం చేసిన హడావుడి, ఆ అరుపులు, ఇంతకాలంగా మద్దతుగా నిలిచిన నార్త్‌స్టాండ్ గ్రూప్. తొలుత ఓ ఫ్యాన్‌గా వాంఖడే స్టేడియంలో కాలుపెట్టా, ఆ తరువాత బాల్ బాయ్‌గా 87 వరల్డ్ కప్‌ను చూశా, 2011 ప్రపంచకప్ ఎత్తా, నా చివరి అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఇక్కడే ఆడా..ఈ ప్రయాణాన్ని మాటల్లో వర్ణించలేను. ఈ విగ్రహం నా ఒక్కడిది కాదు. నా క్రికెట్ హీరోలు, సహచర క్రీడాకారులు, ఇంతకాలం నా వెన్నంటి నిలిచిన అందరికీ ఇది అంకితం. వీళ్లందరూ లేకుండా ఇంతటి ప్రయాణం సాధ్యమయ్యేదే కాదు’’ అంటూ సచిన్ పెట్టిన పోస్ట్ అభిమానులను కదిలిస్తోంది.
Viral Video: నవ్వుతూనే ఈ పిల్లాడు చెప్పిన మాటలు విని కన్నీళ్లు రావడం ఖాయం.. కారులో కూర్చున్న ఓ యువతి మనసు కరిగిపోయి..!
Viral: షాకింగ్ వీడియో! పరిగెత్తుకుంటూ వచ్చిన మహిళను చూడగానే విమానం ఆపేసిన పైలట్!