Share News

Sad News: ఈ పారిశుధ్య కార్మికుడు ఎలా చనిపోయాడో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది !

ABN , First Publish Date - 2023-11-13T19:03:42+05:30 IST

మన జీవితాలు, ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులు నిత్యం పని చేయాల్సిందే. వారు బురదలోకి, చెత్తలోకి దిగి శుభ్రం చేస్తేనే ఇతరులు తమ పనులు తాము చేసుకోగలరు. సమాజానికి ఇంత సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికులు తక్కువ జీతమే పొందుతారు.

Sad News: ఈ పారిశుధ్య కార్మికుడు ఎలా చనిపోయాడో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది !

మన జీవితాలు, ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుధ్య కార్మికులు (Safai workers) నిత్యం పని చేయాల్సిందే. వారు బురదలోకి, చెత్తలోకి దిగి శుభ్రం చేస్తేనే ఇతరులు తమ పనులు తాము చేసుకోగలరు. సమాజానికి ఇంత సేవ చేస్తున్న పారిశుధ్య కార్మికులు తక్కువ జీతమే పొందుతారు. అలాగే ఎక్కువ వారికే రిస్క్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్‌లను (Septic Tank) క్లీన్ చేసే కార్మికులు కనీస రక్షణ కూడా లేకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా గుజరాత్‌ (Gujarat)లోని భావనగర్‌లో ఓ పారిశుధ్య కార్మికుడు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు (Crime News).

భావనగర్‌లోని ప్రభుత్వ ప్రయోగశాల ఆవరణలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను గత శనివారం శుభ్రం చేస్తున్నప్పుడు ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఇద్దరిలో రాజేష్ వేగాడ్ (45) అనే వ్యక్తి మరణించగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు ఓ వ్యక్తి ట్యాంక్‌లోకి ప్రవేశించగా విషవాయువు కారణంగా అతడు ఇబ్బందికి గురయ్యాడు. అతడిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రాజేష్ ఆ ట్యాంక్‌లోకి దిగారు. ఆ వ్యక్తిని రక్షించిన రాజేష్ మాత్రం ప్రమాదానికి గురయ్యాడు.

WhatsApp: వాట్సప్ యూజర్లకు కొత్త టెన్షన్.. ఇకపై వాట్సప్‌ను వాడాలంటే డబ్బులు కట్టాల్సిందేనా..!?

ట్యాంక్‌లో విష వాయువును పీల్చడంతో పాటు ఊపిరి ఆడక స్పాట్‌లోనే మరణించాడు. కాగా, జెట్టింగ్ యంత్రం ఉండగా మనిషిని ట్యాంక్‌లోకి ఎందుకు ప్రవేశపెట్టారంటూ రాజేష్ బంధువులు ఆందోళన ప్రారంభించారు. తమ సోదరుడి మరణానికి నష్ట పరిహారం చెల్లించాలని రాజేష్ అన్నయ్య ఆందోళన ప్రారంభించారు. రాజేష్ కుటుంబానికి ఆర్థిక నష్టపరిహారం అందించి, అతని కుమారుడికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, గుజరాత్‌లో పారిశుధ్య కార్మికుల మరణాలపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.

Updated Date - 2023-11-14T12:07:20+05:30 IST