Salaar - adipurush: ప్రభాస్‌ సూచన మేరకే అలా చేస్తున్నారట!

ABN , First Publish Date - 2023-02-16T18:35:00+05:30 IST

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం ‘సలార్‌’(salaar). కేజీఎఫ్‌ లాంటి చిత్రాన్ని అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Salaar - adipurush: ప్రభాస్‌ సూచన మేరకే అలా చేస్తున్నారట!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న చిత్రం ‘సలార్‌’(salaar). కేజీఎఫ్‌ లాంటి చిత్రాన్ని అందించిన ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు. కోసం పర్వదినాల్లో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌, గ్లింప్స్‌ వస్తాయని ఫ్యాన్స్‌ ఎదురుచూసి ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడం నిరాశ చెందుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట ఏమీ రాకపోవడానికి కారణం లేకపోలేదు. హీరో ప్రభాస్‌ సూచనలే అందుకు కారణం అని టాక్‌ వినిపిస్తోంది. (Salaar is linked with Adipurush promotions)

తాజాగా ప్రభాస్‌ నటిస్తున్న మరో చిత్రం ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్‌కు, సలార్‌ ప్రమోషన్‌కు మధ్య క్లాష్‌ ఉండకూడదని హీరో ప్రభాస్‌ సూచించారట. ఆ మేరకే ప్రస్తుతానికి సలార్‌ చిత్రానికి సంబంధించి లుక్స్‌, గ్లింప్స్‌ బయటకు రావడం లేదట. ‘ఆదిపురుష్‌’ విడుదల వరకు ‘సలార్‌’ టీజర్‌ కూడా విడుదల చేయరని సమాచారం. అయితే ‘ఆదిపురుష్‌’ చిత్రం ‘సలార్‌’ పాలిట నీడల వెంటాడుతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

Updated Date - 2023-02-16T18:45:56+05:30 IST