Share News

Shocking: టూత్‌పేస్ట్ అనుకుని.. నడుము నొప్పి తగ్గడానికి వాడే క్రీమ్‌తో బ్రష్ చేసిందో మహిళ.. చివరకు ఏమైందంటే..!

ABN , First Publish Date - 2023-11-08T10:32:05+05:30 IST

ఒకటి అనుకుని మరొకటి ఉపయోగించడం చాలామంది చేసే పొరపాటే.. కానీ ఈ మహిళ మాత్రం..

Shocking: టూత్‌పేస్ట్ అనుకుని.. నడుము నొప్పి తగ్గడానికి వాడే క్రీమ్‌తో బ్రష్ చేసిందో మహిళ.. చివరకు ఏమైందంటే..!

ఒకటి అనుకుని మరొకటి ఉపయోగించడం చాలామంది చేసే పొరపాటే.. దీనివల్ల నష్టం ఏమీ జరగకపోతే ఫర్యాలేదు. కానీ కొన్నిసార్లు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఓ మహిళ పాపం టూత్ పేస్ట్ అనుకుని నడుము నొప్పి తగ్గడానికి ఉపయోగించే క్లీమ్ తో బ్రష్ చేసుకుంది. ఆ తరువాత ఆమెకు ఎదురైన అనుభవాలు, చోటు చేసుకున్న పరిణామాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'అసలు దాన్ని పేస్ట్ అని ఎలా అనుకున్నావమ్మా తల్లీ' అని నోరెళ్లబెడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'బావగారు బాగున్నారా' సినిమా ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో స్టార్టింగ్ లో హీరోయిన్ రంభ పరధ్యానంలో జాంగ్రీని చెట్నీలో ముంచుకుని తింటుంది. అది చూస్తుంటే అందరికీ తెగ నవ్వు వస్తుంది కానీ రంభ మాత్రం వేరే ఆలోచనలో ఉంటుంది. పరధ్యానంలోనూ, ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు చాలామంది ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. ఆ పరిస్థితులలో ఉన్నప్పుడు చేసే పనిమీద ధ్యాస ఉండదు. ఓ మహిళ కూడా అలాగే పరధ్యానంలో పొరపాటు చేసింది. కిట్టిల్సన్ అనే విదేశీ మహిళ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి నెట్ ఫ్లిక్స్(Netflix) లో బెక్ హమ్(Beckham) అనే డాక్యుసిరీస్ ను చూసింది. ఆ తరువాత దాని గురించి తన బాయ్ ఫ్రెండ్ తో డిస్కస్ చేసింది. అప్పటినుండి ఆమె ఆ డాక్యుమెంటరీ గురించే ఎక్కువశాతం ఆలోచించేది. ఈ క్రమంలోనే ఆమె పళ్లుతోముకునేందుకు టూత్ పేస్ట్ కు బదులుగా డీప్ హీట్ క్రీమ్ ను బ్రష్ మీద వేసుకుని పళ్లు తోమింది. ఆ తరువాత ఆమె తన నోరు మండటం, ఘాటైన వాసనతో పాటు చాలా అసౌకర్యం ఎదుర్కొంది. విషయం తెలిసిన వెంటనే ఆమె బాయ్ ఫ్రెండ్ పాయిజన్ కంట్రోల్ కు కాల్ చేశాడు.

ఇది కూడా చదవండి: Dog Video: 4 నెలలుగా ఆస్పత్రి మార్చురీ వద్దే పడిగాపులు కాస్తున్న శునకం.. చనిపోయిన యజమాని తిరిగొస్తాడన్న ఆశతో..!



పొరపాటున ఎవరైనా పాయిజన్ తీసుకున్నవారికి సహాయకంగా పనిచేసే పాయిజన్ కంట్రోల్ టీమ్ కు కాల్ చేసిన తరువాత ఆ టీమ్ వచ్చి మహిళకు చికిత్స అందించింది. కోల్గేట్ టూత్ పేస్ట్, డీప్ హీట్ క్రీమ్ రెండు ట్యూబులు ఒకే విధంగా ఉండటం వల్ల తాను పొరపాటు చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సంఘటనను సదరు మహిళ బాయ్ ఫ్రెండ్ టిక్ టాక్ లో వీడియో రూపంలో తెలియజేశాడు. ఈ విషయం విన్న నెటిజన్లు షాకవుతున్నారు. 'అసలు ఆ క్రీమ్ ను టూత్ పేస్ట్ అని ఎలా అనుకున్నావు తల్లీ' అని నోరెళ్లబెడుతున్నారు. 'అసలు కోల్గేట్ టూత్ పేస్ట్ కు డీప్ హీట్ క్రీమ్ ట్యూబ్ కు ఏమాత్రం దగ్గరి పోలికల్లేవు' అని మరొకరు కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: Woman: అమ్మ బాబోయ్.. ఈ మహిళ యవ్వారం మామూలుగా లేదుగా.. పోలీసు అధికారిపైనే కేసు పెట్టింది.. అసలు కథేంటంటే..!


Updated Date - 2023-11-08T10:32:06+05:30 IST