Sim Cards: మీ ఐడీతో ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకుని ఉపయోగిస్తున్నారని సందేహమా? మీకు తెలియకుండా జరిగే మోసాన్ని ఇలా కనిపెట్టేయండి..
ABN , First Publish Date - 2023-06-18T16:48:05+05:30 IST
డేటా ఫ్రీగా వస్తుందనో, మొబైల్ రీఛార్ఝీ ఆఫర్ ఉందనో విరివిగా సిమ్ కార్డులు తీసుకునేవారు అధికం. కానీ కొన్నిసార్లు మీ ఆధార్ కార్డ్ సహాయంతో ఇతరులు మీకు చెప్పకుండా సిమ్ కార్డ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకే తెలియకుండా ఆ నెంబర్ సహాయంతో మోసాలకు పాల్పడటం, తప్పుడు పనులు చేయడం చేస్తారు., ఈ కారణంగా ఏదైనా సమస్యలు ఏర్పడితే అప్పుడు దానికి పూర్తీగా బాధితులు మీరే అవుతారు.
ఇప్పట్లో చిన్న చిన్న షాపులలో కూడా సిమ్ కార్డులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఒక్క ఐడీ ప్రూఫ్ ఉంటే చాలు.. ముందు వెనుకా ఆలోచించకుండా సిమ్ కార్డులు అమ్మేస్తారు. డేటా ఫ్రీగా వస్తుందనో, మొబైల్ రీఛార్ఝీ ఆఫర్ ఉందనో ఇలాంటి సిమ్ కార్డులు తీసుకునేవారు అధికం. కానీ కొన్నిసార్లు మీ ఆధార్ కార్డ్ సహాయంతో ఇతరులు మీకు చెప్పకుండా సిమ్ కార్డ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకే తెలియకుండా ఆ నెంబర్ సహాయంతో మోసాలకు పాల్పడటం, తప్పుడు పనులు చేయడం చేస్తారు., ఈ కారణంగా ఏదైనా సమస్యలు ఏర్పడితే అప్పుడు దానికి పూర్తీగా బాధితులు మీరే అవుతారు. అయితే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయడానికి టెలికాం శాఖ(Telecom department) ప్రజలకు సహకారం అందిస్తోంది. మీకు తెలియకుండా మీ ఐడీ సహాయంతో ఇతరులు సిమ్ కార్డు కొనుగోలు చేశారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ.. ఇదిమాత్రమే కాదు, ఆ మోసపూరిత నెంబర్ ను బ్లాక్ చేయచ్చు కూడా.. ఇంతకీ ఈ విషయం ఎలా తెలుసుకోవాలంటే..
ఇప్పటికాలంలో మోసాలు చాలా సులువుగా జరిగిపోతున్నాయి. ఎవరిదైనా ఆధార్ కార్డ్ దొరికితే చాలు, సిమ్ కార్డుల నుండి బ్యాంకు ఖాతాల వరకు చాలా మోసాలకు పాల్పడుతారు. అయితే అలాంటి పనులు చేసేవారు ఇతరుల ఐడీ కార్డుల సహాయంతో మోసాలకు పాల్పడుతారు(fraud with others proofed sim cards). మీ ఐడీ సహాయంతో ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకుని దుర్వినియోగం చేస్తారని మీకు అనిపిస్తే టెలికాం అందుబాటులో ఉంచిన సేవ ద్వారా మోసాన్ని(sim card fraud) కనిపెట్టవచ్చు. ఇందుకోసం మొబైల్ లేదా సిస్టంలో టెలికాం వారి tafcop.sancharsaathi.gov.in వెబ్సైట్ కు వెళ్శాలి. వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ను నెంబర్ బాక్స్ లో నమోదు చేయాలి. ఇలా నమోదు చేసిన తరువాత మొబైల్ నెంబర్ కు ఓటిపి(OTP) వస్తుంది. ఈ ఓటిపి ఎంటర్ చేసిన తరువాత క్యాప్చ(captcha) ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇలా చేసిన తరువాత మీ ఐడీ ఆధారంగా ఎన్ని మొబైల్ నెంబర్స్ రిజిష్టర్ అయి ఉన్నాయో డిస్ప్లే అవుతుంది.
Viral video: ఓ మహిళ చేతిలో బిడ్డను చూడగానే గొరిల్లాల ఊహించని రియాక్షన్.. పరిగెత్తి వెళ్లి మరీ అవి చేసిన పనేంటో మీరే చూడండి..
సాధారణంగా ఒక ఐడీ సహాయంతో ప్రతి ఒక్కరూ 9 సిమ్ కార్డులను పొందవచ్చు. వెబ్సైట్ లో పరిశీలించిన తరువాత మీకు తెలియకుండా మీ ఐడీతో ఏదైనా సిమ్ కార్డు యాక్టివ్ లో ఉన్నట్టైతే మీరు ఆ నెంబర్ కు రిపోర్డ్ కొట్టచ్చు. ఇలా రిపోర్ట్ కొట్టిన నెంబర్ ను ప్రభుత్వం తనిఖీ చేస్తుంది. రిపోర్ట్ కొట్టిన ఫిర్యాదుదారు అభ్యర్థన మేరకు ఆ నెంబర్ ను బ్లాక్ చేస్తుంది.