Skincare: చలికాలంలో చర్మం పగుళ్లను ఇంత సింపుల్ గా నివారించవచ్చని మీకు తెలుసా? కేవలం ఒకే ఒక్క పదార్థం ఉపయోగిస్తే చాలు!
ABN , First Publish Date - 2023-10-25T16:15:43+05:30 IST
చలికాలంలో అందరూ భయాలేవి అక్కర్లేకుండా హ్యాపీగా వాడుకోదగిన పదార్థమిది. దీని ముందు ఓ బ్యూటీ ప్రోడక్ట్ పనికిరాదు.
చలికాలం కేవలం చలినే కాదు చర్మసంబంధ సమస్యలను కూడా వెంటబెట్టుకొస్తుంది. పొడిచర్మం గలవారికి చలికాలంలో నరకం కనిపిస్తుంది. చాలామందికి చర్మం పొడిబారిపోయి పగుళ్లు వస్తాయి. పెదవులు, పెదవుల మూలలు చీలి రక్తం కూడా కారుతుంది. మాట్లాడాలన్నా, తినాలన్నా కూడా ఇబ్బందే. ఇక బుగ్గలు, నుదురు, ముక్కు ఇలా ప్రతి చోటా చర్మం పొలుసుల్లా లేచి మంట పెడుతుంది. కాళ్లు చేతులు పగిలిపోయి చర్మం తెల్లగా పొట్టు లేచినట్టు కనిపిస్తుంది. చలికాలంలో ఈ సమస్యలు అధిగమించడానికి చాలామంది మాయిశ్చరైజర్ క్రీములు, బాడీ లోషన్లు ఉపయోగిస్తుంటారు. అయితే ఇవన్నీ రసాయనాలతో కూడినవి కావడం వల్ల వీటి వాడకం గురించి భయపడేవారు కూడా ఉంటారు. ఇలాంటి భయాలేవి అక్కర్లేకుండా అందరూ హ్యాపీగా వాడుకోదగిన పదార్థం ఒకటుంది. అదే గ్లిజరిన్(glycerine). గ్లిజరిన్ ను ఇంట్లోనే ఉండే మూడు పదార్థాల కాంబినేషన్ లో ఉపయోగిస్తే ఏ బ్యూటీ ప్రోడక్ట్ కూడా ఇవ్వనంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. అవేంటో తెలుసుకుంటే..
గ్లిజరిన్, కలబంద..(glycerine, aloe vera)
చలికాలం(winter)లో చర్మం పగుళ్లను నివారించడమే కాకుండా చర్మం నిగనిగలాడాలంటే గ్లిజరిన్, కలబంద అద్భుతమైన కాంబినేషన్. ఒక స్పూన్ అలోవెరా జెల్ లో ఒక స్పూన్ గ్లిజరిన్ కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా రోజూ ఏదో ఒక సమయంలో చేస్తుంటే ముఖ చర్మం పగుళ్లు పోవడమే కాదు చర్మం మెరుస్తుంది.
Health Tips: 30-30-30 రూల్ గురించి విన్నారా? ఫిట్ గా స్లిమ్ గా ఉండేవారి సీక్రెట్ ఇదేనట..
గ్లిజరిన్, తేనె..(glycerine, honey)
పొడిబారిన చర్మం మృదువుగా మారడానికి, చర్మం పగిలిపోకుండా నివారించడానికి గ్లిజరిన్, తేనె కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుంది. గ్లిజరిన్, తేనెను సమాన పరిమాణంలో తీసుకుని రెండింటిని మిక్స్ చేయాలి. ఈ ద్రావణాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. పొడిబారిన చర్మానికి తిరిగి జీవం వస్తుంది. చర్మంలో మెరుపు స్పష్టంగా కనిపిస్తుంది.
గ్లిజరిన్, రోజ్ వాటర్..(glycerine, rose water)
సెలబ్రిటీలు కూడా ఫాలో అయ్యే సింపుల్ టిప్ ఇది. రోజ్ వాటర్, గ్లిజరిన్ రెండింటిని సమాన పరిమాణంలో తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసి ఈ ద్రావణాన్ని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవచ్చు. ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకుని ఆ తరువాత గ్లిజరిన్, రోజ్ వాటర్ ద్రావణాన్ని కాటన్ బాల్ సహాయంతో ముఖమంతా అప్లై చేయాలి. ఆరిపోయిన తరువాత ముఖం కడుక్కోవాలి. లేదంటే దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసి అలాగే వదిలేయచ్చు. ఈ టిప్ వల్ల చర్మం అద్దంలా మెరుస్తుంది.