Smartphone: ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ పేలిపోవడం ఖాయం..!

ABN , First Publish Date - 2023-08-09T10:15:26+05:30 IST

ఫోన్ పేలిపోయినా తరువాత డబ్బు పెట్టి కొత్తది కొనుక్కోవచ్చు కానీ పేలుడు సంంభవించినప్పుడు దాని దగ్గరగా మనుషులుంటే మాత్రం అది ప్రాణాలను కబళించే అవకాశం ఉంది. అందుకే స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చెయ్యకూడదని పొరపాట్లేమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Smartphone: ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం స్మార్ట్ ఫోన్ పేలిపోవడం ఖాయం..!

ఇప్పట్లో ప్రతి ఒక్కరి దగ్గరా స్మార్ట్ ఫోన్ ఉంటోంది. ఇంట్లో ప్రతి ఒక్కరికి విడిగా టూత్ బ్రష్, చెప్పులు లాంటివి ఉన్నట్టు స్మార్ట్ ఫోన్ కూడా ఉంటుంది. అయితే గత కొన్నేళ్ళుగా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు, ఛార్జింగ్ పెట్టినప్పుడు స్మార్ట్ ఫోన్ పేలిపోయి ప్రాణ నష్టం జరుగుతోంది. చాలావరకు స్మార్ట్ ఫోన్ పేలడానికి బ్యాటరీ కారణమవుతూ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చేసే కొన్ని తప్పులే ఇలా పేలుడు సంభవించడానికి కారణమవుతుంది. ఫోన్ పేలిపోయినా తరువాత డబ్బు పెట్టి కొత్తది కొనుక్కోవచ్చు కానీ పేలుడు సంంభవించినప్పుడు దాని దగ్గరగా మనుషులుంటే మాత్రం అది ప్రాణాలను కబళించే అవకాశం ఉంది. అందుకే స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చెయ్యకూడదని పొరపాట్లేమిటో(smart phone charging mistakes) తెలుసుకోవడం చాలా ముఖ్యం.

స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ చేసే విషయంలో చాలామంది చేసే తప్పు పిన్ సరిపోతే చాలు ఏదో ఒక ఛార్డర్ తో ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. కానీ స్మార్ట్ ఫోన్ లో యానివర్శల్ ఛార్జింగ్ ఇంటర్ ఫేస్ ఉపయోగించబడుతుంది. తప్పు ఛార్జర్(wrong charger) తో ఛార్జింగ్ పెడితే ఫోన్ లో బ్యాటరీ చాలా తొందరగా దెబ్బతినే ప్రమాదం ఉంది. బ్యాటరీ దెబ్బ తింటే ఆ ఫోన్ ఎక్కువ కాలం సేఫ్ గా ఉండదు.

చాలామంది ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి అడాప్టర్ ఒరిజనల్ ఉంది కాబట్టి ఏం ప్రమాదం జరగదని అనుకుంటారు. కానీ అడాప్టర్ ఒరిజినల్ గా ఉండి, కేబుల్ వైర్(adapter and cable) మాత్రం లోకల్ ది ఉపయోగిస్తే అది స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీని దెబ్బతీస్తుంది. వీటి వల్ల విద్యుత్ సరఫరా సమతుల్యత లోపిస్తుంది.

Indian Railway; రైల్లో ఏసీ కోచ్‌లో రిజర్వేషన్ టికెట్.. ట్రైన్ రాగానే తన సీటును వెతుక్కుంటూ వెళ్లి చూస్తే షాకింగ్ సీన్..!



స్మార్ట్ ఫోన్ ప్రొటెక్షన్ కోసం, ఫ్యాషన్ గా కనిపించడంకోసం ఇప్పట్లో ఫోన్ కవర్లు(Phone cover) చాలా వాడుతుంటారు. అయితే ఈ ఫోన్ కవర్ ల గురించి పెద్ద షాకింగ్ నిజం బయటపడింది. స్మార్ట్ ఫోన్ ఛార్డింగ్ చేసేటప్పుడు ఈ కవర్లను తొలగించమని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు అది వేడెక్కుతుందని, ఫోన్ కవర్ కారణంగా ఈ వేడి బయటకు రాదని అంటున్నారు. దీనివల్ల ఫోన్ బ్యాటరీ పాడైపోతుంది. ఈ వేడి కారణంగా ఒక్కోసారి ఫోన్ పేలిపోయే అవకాశం ఉంటుంది.

ఇప్పట్లో అందరికీ తొందర ఎక్కువ. ఫోన్ ఛార్జింగ్ పెట్టినా అది తొందరగా ఫుల్ అవ్వాలని అనుకుంటారు. కొందరు ఇదే కారణంతో ఫాస్ట్ ఛార్జర్(fast charger) లను ఉపయోగిస్తారు. దీంతో ఫోన్ తొందరగా ఛార్జింగ్ అవుతోందని అనుకుంటారు. కానీ ఇది బిగ్ మిస్టేక్. ప్రతి స్మార్ట్ లో బ్యాటరీ భిన్నంగా ఉంటుంది. అందుకే ప్రతి కంపెనీ ఫోన్ లో బ్యాటరీని బట్టి ఛార్జర్ ఇస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ని సపోర్ట్ చేసే బ్యాటరీలను ఫాస్ట్ ఛార్జర్ తోనూ, సాధారణ ఛార్జర్ ను సపోర్ట్ చేసే బ్యాటరీని సాధారణ ఛార్జర్ తోనూ ఛార్జింగ్ చేయాలి. లేకపోతే బ్యాటరీ బ్లాస్ట్ అవుతుంది.

రాత్రి సమయంలో ఛార్జింగ్(charging over all night) పెట్టే అలవాటు ఉన్నవారు సమస్యను కోరి తెచ్చుకున్నట్టే. సాధారణంగా ఫోన్ ఫుల్ గా ఛార్జింగ్ కావడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఫాస్ట్ ఛార్జర్ ఫోన్లు అయితే కేవలం 45నిమిషాల్లో ఛార్జింగ్ ఫుల్ అవుతాయి. రాత్రంతా ఫోన్ ను ఛార్జింగ్ లో ఉంచడం, పగటి సమయంలో కూడా ఫోన్ ను గంటల తరబడి ఛార్జ్ చేయడం ఫోన్ పేలుడు ప్రమాదాలకు అవకాశం ఇస్తుంది.

Dying in sleep: నిద్రలోనే కొందరికి గుండెపోటు..? క్షణాల్లోనే మరణం.. అసలు ఎందుకిలా జరుగుతుందంటే..!


Updated Date - 2023-08-09T10:15:26+05:30 IST