Viral Photo: అమ్మాయిలూ సారీ.. అంటూ ఆటో వెనుక వింత కొటేషన్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2023-03-07T16:23:37+05:30 IST

ఆటోల వెనుక చాలా మంది తమ అభిమాన హీరోల ఫొటోలనో, దేవుడి బొమ్మలనో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. మరికొందరు మాత్రం ఫన్నీ కొటేషన్లు, ఆసక్తికర పెయింటింగ్స్ వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు.

Viral Photo: అమ్మాయిలూ సారీ.. అంటూ ఆటో వెనుక వింత కొటేషన్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..

ఆటోల వెనుక చాలా మంది తమ అభిమాన హీరోల ఫొటోలనో, దేవుడి బొమ్మలనో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. మరికొందరు మాత్రం ఫన్నీ కొటేషన్లు, ఆసక్తికర పెయింటింగ్స్ వేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అవి ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ ఫొటోలో ఓ ఆటో డ్రైవర్ రాయించిన మెసేజ్ నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోంది (Funny message on Auto).

Vanshika Garg అనే ట్విటర్ యూజర్ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ఉన్న ఆటోపై ``సారీ అమ్మాయిలు.. మా ఆవిడ చాలా స్ట్రిక్ట్`` (Sorry girls, my wife is very strict) అని రాసి ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది (Viral Photo). ఇప్పటికి 1.15 లక్షల వ్యూస్ సాధించింది. ఈ ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``కచ్చితంగా ఆ మెసేజ్‌ను అతడి భార్యే రాయించి ఉంటుంది``, ``అయ్యో.. ఇప్పుడు అమ్మాయిల పరిస్థితి ఏంటి?``, ``ఈ కాలంలో ఇలాంటి భర్త దొరకడం అదృష్టం``, ``వెయ్యి శాతం ఆత్మవిశ్వాసం`` అని ఫన్నీ కామెంట్లు (Funny Comments) చేస్తున్నారు.

ఛీ..ఛీ.. ఇలాంటి మనుషుల మధ్యనా మనం బతుకుతున్నది..? ఈ రిక్షా కార్మికుడి ఫొటో నెట్టింట ఎందుకు వైరల్‌ అయిందంటే..

Updated Date - 2023-03-07T16:25:27+05:30 IST