Shah Rukh Khan Diet: 60 ఏళ్ల వయసొస్తున్నా.. పాతికేళ్ల కుర్రాడిలాగే లుక్స్.. ఇంతకీ షారూఖ్ ఖాన్ ఏం తింటాడో తెలుసా..?
ABN , First Publish Date - 2023-09-23T12:40:35+05:30 IST
రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటాడట. మిగిలిన సమయాల్లో అడపాదడపా ఉపవాసం కూడా చేస్తాడట.
వయసు పెరుగుతున్నకొద్దీ కొందరిలో వృధ్ధాప్యం తాలుకు ఛాయలు అస్సలు కనిపించవు. ఆడవారు, మగవారిలో కొందరిలో మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్నా కూడా ఇలా వయసు కనిపించకుండా ఉండాలంటే ఏంచేయాలో మనం ఎక్కువగా సినీతారలను చూసే ఫాలో అవుతూ ఉంటాం. మరీ ముఖ్యంగా ఇప్పటి హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న హీరో షారుఖ్ ఖాన్ విషయంలో చాలామందికి అతని డైట్ గురించి బోలెడు డౌట్స్ ఉన్నాయి. అతని డైట్ రహస్యం ఈ 50లలో అందంగా కనిపించడానికి, షారుఖ్ ఖాన్ డైట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
57 ఏళ్ళ షారుఖ్ ఫిట్ నెస్ రహస్యం..
ఇప్పటికీ షారుఖ్ ఖాన్ ఫిట్ నెస్ లో చాలామందికి ఉన్న అనుమానం అతని ముఖంలో కనిపించని ముసలితనం ఛాయలు, దీనికి సంబంధించిన రహస్యం గురించి చెప్పుకుంటే..
వ్యాయామం ద్వారా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోండి.
పఠాన్, జవాన్ లో షారుఖ్ ఖాన్ శరీరాన్ని చూసినవారు ఇంకా అభిమానాన్ని పెంచుకున్నారు. అతని శరీరాకృతి పూర్తిగా మారిపోయింది. ఈ మార్పుకు దాదాపు రెండేళ్ళ టైం పట్టిందట.
మరీ ఎక్కువ వ్యాయామ శిక్షణ తీసుకోడానికి..
ఈ సినిమాలకు ముందు షారుఖ్ ఖాన్ హెవీ వర్కవుట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ప్రతి రోజూ వర్కవుట్ చేయడం మాత్రం మానడు.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం..
షారుఖ్ ఖాన్ తీసుకునే ఆహారంలో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి.
షారుఖ్ తన డైట్ సీక్రెట్ చెప్పాడు.
షారుఖ్ తన డైట్ సీక్రెట్ గురించి చెప్పాడు. తను తీసుకునే ఆహారం చాలా సాధారణమైనదని చెప్పుకొచ్చాడు.
బ్రోకలీ, చికెన్
తన ఆహారంలో సాధారణంగా గ్రిల్డ్ చికెన్, బ్రోకలీ ఉంటాయట. కొన్ని సార్లు ఈ చికెన్ తో పాటు కొన్ని పప్పులను కూడా తీసుకుంటాడు.
ఇది కూడా చదవండి: మంచంపై పడుకుని టీవీ చూస్తున్న తండ్రి.. కింద కూర్చుని పెగ్ కలుపుకుంటున్న కొడుకు.. ఎవరికి అని అడిగితే..!
రోజుకు రెండు సార్లు భోజనం..
రోజుకు రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకుంటాడట. మిగిలిన సమయాల్లో అడపాదడపా ఉపవాసం కూడా చేస్తాడట.
నిద్ర కూడా చక్కగా నిద్రపోతాడు.
షారుఖ్ ఖాన్ దాదాపు రోజుకు 8 గంటల పాటు నిద్రపోతాడు. ఇలాంటి జాగ్రత్తలతో అతని చర్మం ఈ వయసులో కూడా మెరుస్తూ కనిపిస్తుంది.