Aparna Balamurali: హీరోయిన్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయి
ABN , First Publish Date - 2023-01-19T18:07:17+05:30 IST
అపర్ణా బాలమురళీకి చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కాలేజీని సందర్శించగా ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ (Soorarai Pottru)తో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అపర్ణా బాల మురళీ (Aparna Balamurali). ఈ సినిమాలో ఆమె నటనకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికీ గాను ఆమె జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది. తాజాగా అపర్ణా బాలమురళీకి చేదు అనుభవం ఎదురైంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ కాలేజీని సందర్శించగా ఓ విద్యార్థి అనుచితంగా ప్రవర్తించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అపర్ణా బాల మురళీ తాజాగా ‘తన్కమ్’ (Thankam) సినిమాలో నటించింది. తన సహనటుడు వినీత్ శ్రీనివాసన్ (Vineeth Srinivasan) తో కలసి మూవీ ప్రమోషన్స్ చేస్తుంది. అందులో భాగంగా ఓ లా కాలేజీని సందర్శించింది. ఆమె స్టేజ్‌పై ఉండగా ఓ విద్యార్థి అక్కడికి చేరుకున్నాడు. ఆమెకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. నిల్చొమని బలవంతం చేశాడు. భుజంపై చేయి వేయడానికి ప్రయత్నించాడు. యువకుడి ప్రవర్తనతో ఆమె కంగుతింది. సత్వరమే తేరుకుని అతడి నుంచి దూరంగా జరిగింది. ఈ ఘటనపై అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితంగా ఆ విద్యార్థి స్టేజ్‌పైకి వచ్చి ఆమెకు క్షమాపణలు చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ ఆ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రతి ఒక్కరు హద్దులను తెలుసుకుని ప్రవర్తించాలి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సెలబ్రిటీలు ఎవరు ఈ ఘటనను ఖండించలేదు’’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. ‘‘అపర్ణ సహ నటుడు వినీత్ శ్రీనివాసన్ మౌనం ఆశ్చర్యానికి గురి చేసింది’’ అని మరో నెటిజన్ చెప్పారు. గతేడాది సెప్టెంబర్‌లో ‘సాటర్ డే నైట్’ మూవీ ప్రమోషన్స్‌లో ఇద్దరు హీరోయిన్సకు ఇటువంటి చేదు అనుభవమే ఎదురైంది.