Success Story: నిత్యం వేధించే పోలీస్ భర్తకు గుడ్ బై.. నువ్వేం చేయలేవ్ అన్న భర్త మాటలతో పంతం.. ఇప్పుడు ఈమె ఏం చేస్తోందో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-04-30T12:42:04+05:30 IST
14ఏళ్ళ వయసులో పెళ్ళి.. భర్త చేతిలో చిత్రహింసలు.. నువ్వేం చేయలేవని భర్త ఎగతాళి.. ఇవన్నీ చూస్తూ.. భరిస్తూ.. ఇప్పుడామె..
ఆడవాళ్ళు జీవితంలో ఎన్నో భరిస్తారు.. పేదరికం ఉన్నా సర్థుకుపోతారు.. కానీ హింసలు పెడుతూ.. శారీరకంగా వేధిస్తుంటే మాత్రం భరించలేరు. ఆ హింసలు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడేవారు కొందరైతే.. ఇంటి గడప దాటి తమ జీవితాన్ని తాము అందంగా మలచుకోవడానికి ప్రయత్నం చేసేవారు మరికొందరు. నీతా రెండవ కోవకు చెందిన మహిళ. తల్లిదండ్రుల చెర నుండి బయటపడి పెళ్లి చేసుకుని, భర్తతో అయినా జీవితం సుఖంగా ఉంటుందిలే అనుకున్న ఆమెకు చిత్రహింసలే లోకమయ్యాయి. వాటిని దాటుకుని బయటకు రావాలని ఆమె అనుకున్నా నువ్వేమి చెయ్యలేవని భర్త ఆమెను ఎగతాళి చేశాడు. కానీ ముగ్గురు పిల్లలను చదివిస్తూ.. తనూ చదువుకుని.. జీవితంలో విజేతగా నిలిచిన నీతా కథ ఇది..
చిన్నతనంలో పిల్లలకు ప్రేమ కావాలి. కానీ నీతాకు గుర్తున్నంత వరకు ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు. ఆమెకు తన చిన్నతనంలో తల్లి కొట్టడం మాత్రమే గుర్తుంది. కన్న బిడ్డను కొట్టొద్దని చెప్పాల్సిన తండ్రి తప్పతాగి ఇంటికి రావడం గుర్తుంది. దీంతో నీతా బాల్యం అంతా కన్నీళ్లు తప్ప తూనీగలా తుళ్లిపడే రోజులేవీ లేవు. నీతాకు ఆరేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లి ఆత్మహత్య(sucide) చేసుకుని మృతిచెందింది. తోడుగా ఉండాల్సిన తండ్రి ఆమెను వదిలేశాడు. తల్లిదండ్లులు ఇద్దరూ లేక ఒంటరిగా మారిన నీతాను వాళ్ల తాతగారు తనవెంట తీసుకెళ్లారు. ఆమెను ఎంతో ప్రేమగా పెంచారు. నీతాకు 14ఏళ్ల వయసులో పోలీసాఫీసర్(police సంబంధం వచ్చింది. నీతా అతనితో సంతోషంగా ఉంటుందని నీతా తాతగారు ఆమెను పోలీసాఫీసర్ కు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ వాళ్లు అనుకున్నట్టు భర్తతో ఆమె సంతోషంగా లేదు. దానికి బదులు ఆమెకు అతని చేతిలో శారీరక హింస(phycial abuse) అధికంగా ఉండేది. ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆమె సతమతం అయ్యేది. ఈ క్రమంలోనే ఆమెకు ముగ్గురు పిల్లలు కలిగారు. భర్త ఆమెను పట్టించుకోవడం మానేశాడు. పిల్లల అవసరాలకు, ఇంటి అవసరాలకు డబ్బు ఇచ్చేవాడు కాదు. దీంతో ఆమె పిల్లలను తీసుకుని ఇంటి గడప దాటింది. పిల్లలతో కలసి స్లమ్ ఏరియాలో నివాసం ఉండేది(lives in slum area). ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలను మాత్రం వదల్లేదు. ఇల్లు గడవడానికి ఏదో పని వెతుక్కోవాలనే ఉదేశంతో స్కూటర్లు, బైకులు, కార్లు, వ్యాన్ లు నడపడం నేర్చుకుంది(learn to drive scooty, bike, car, van). 'అవన్నీ నడపడం నేర్చుకుని నువ్వేమి చేస్తావు?' అని భర్త ఎగతాళి చేసేవాడు. కానీ నీతా ఏనాడు అతని మాటలకు డీలా పడిపోలేదు. పైపెచ్చు ఆమెలో మరింత పట్టుదల పెరిగింది. 34నాలుగేళ్ల వయసులో భర్త నుండి విడిపోయింది.
స్కూల్ పిల్లలను తీసుకెళ్లే స్కూల్ బస్, స్కూల్ వ్యాన్ డ్లైవర్ గా(school van driver) ఆమె పనిచేసేది. స్కూల్ పిల్లలమీద దారుణాలు అధికంగా జరుగుతుండటంతో చాలామంది తల్లిదండ్రులు నీతా వ్యాన్ లో తమ పిల్లలను పంపడానికి ఆసక్తి చూపించేవారు. దీంతో ఆమె క్రమంగా ఆ ఫీల్డ్ లో ఎదగడం ప్రారంభించింది. తొందరలోనే ఆమె మినీ బస్ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకుంది. తన ముగ్గురు పిల్లలను చదివిస్తూనే.. ఆమె తన చదువు పూర్తీ చేసింది. వ్యాపార సామ్రాజ్యంలో తనదైన మార్క్ చూపిస్తున్న నీతా ఇప్పుడు నీతా ట్రావెల్స్ కు యజమానిగా 13బస్సులకు (13busses owner)ఓనర్. తన జీవితం గురించి ఎవరైనా అడిగితే.. జీవితం బాగుందని చెబుతూ తన విజయాలను గుర్తుచేసుకుని గర్వపడుతోంది. జీవితంలో ఓడిపోతున్నామనే మహిళలకు నీతా గొప్ప ప్రేరణ అవుతుంది.