Women's Day 2023 : ఈ అమ్మాయి సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా..! దాదాపు 25 లక్షలు పైనే..!

ABN , First Publish Date - 2023-03-08T14:45:53+05:30 IST

స్మృతికి 1,000 కంటే ఎక్కువ మంది కొనుగోలుదారుల కస్టమర్ బేస్ ఉంది.

Women's Day 2023 : ఈ అమ్మాయి సంవత్సరానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా..!  దాదాపు 25 లక్షలు పైనే..!
jewellery business

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటగా 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా మార్చి 8న జరుపుకోవడానికి ఐక్యరాజ్యసమితి ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కొంతకాలం తర్వాత, 1977లో U.N జనరల్ అసెంబ్లీ మహిళల హక్కులు, అంతర్జాతీయత కోసం ఒక ప్రకటనను ఆమోదించింది. శాంతి, వారి జాతీయ సంప్రదాయాలకు అనుగుణంగా దేశాలు గుర్తించబడతాయి. ఈ తీర్మానాన్ని అమలు చేయడంలో లక్ష్యాలు, శాంతి ప్రయత్నాలు, అభివృద్ధిలో మహిళల కీలక పాత్రపై అవగాహన పెంచడం, వివక్షను అంతం చేయడం, ప్రపంచానికి మహిళల పూర్తి , సమాన సహకారాన్ని సాధించడం వంటి మార్గదర్శకాలను ఏర్పరిచింది.

అయితే మహిళ ఏరంగంలోనైనా ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఎలాంటి సపోర్ట్ అటు కుటుంబం నుంచి గానీ, ఇటు సమాజం నుంచి కానీ ఉండడం లేదు. ఈ తరుణంలో చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు కానీ వారిని సాధికారత వైపు నడిపేవారు గానీ లేరు. ఈ మహిళ చిన్నతనం నుంచి సొంతంగా తయారు చేసుకున్న గిఫ్ట్స్‌ని మాత్రమే ఫ్రెండ్స్ పుట్టిన రోజుకి బహుమతిగా ఇచ్చేది. చాలా సంతోషంగా అనిపించినప్పుడల్లా పెద్దయ్యాకా ఇదే వ్యాపారం చేయాలనుకుంది. ఏ వస్తువైనా మన చేతులతో తయారుచేసుకుంటే దానిలో వచ్చే ఆనందం, తృప్తి వేరు. ఏది శ్రమ లేకుండా తయారు కాదు. అంతేనా దానికి ప్రత్యేకమైన శ్రద్ధ కూడా కావాలి. అయితే తనకు చిన్నతనం నుంచి ఉన్న అభిరుచినే ఈమె వృత్తిగా మార్చుకుంది. విషయంలోకి వెళితే..

Shika.jpg

15 సంవత్సరాల వయస్సులో, స్మృతి తన కళాత్మక నైపుణ్యాన్ని విజయవంతమైన నగల వ్యాపారంగా మార్చింది. షికా క్రియేషన్స్ అనే పేరుతో స్మృతి రన్ చేస్తున్న ఈ జ్యుయేలరీ వ్యాపారం సక్సెస్‌గా విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వచ్చేంత గొప్పగా కొనసాగుతుంది. ఒక్క భారతదేశంలోనే కాకుండా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్ డమ్, స్వీడన్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి కూడా ఆర్డర్స్ (Orders) వస్తున్నాయి. మొత్తానికి స్మృతి ఆదాయం సంవత్సరానికి 25 లక్షల పైనే ఉంది.

ఇది కూడా చదవండి: ఈ మహిళలంతా మన భారతీయులు.. వీళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే..!

కోయంబత్తూరుకు చెందిన 23 ఏళ్ల స్మృతి ఫ్యాషన్ టెక్నాలజీ (Fashion technology)లో బీటెక్ చేసింది. కానీ కళకు ఎప్పుడూ మొదటి ప్రేయారిటీ ఇచ్చేది. చిన్నతనం నుండి స్నేహితుల పుట్టినరోజులకు, చిన్న చిన్న ఫంక్షన్స్ కు తన చేతులతో తయారు చేసిన గృహలంకరణ బహుమతులు ఇచ్చి ఆనందపడేది. స్మృతి కళపై ఆసక్తిని నైపుణ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఆభరణాలను తయారు చేయడం మీద సాధన చేశాకా దానినే వృత్తిగా ఎంచుకున్నాను.

షికా క్రియేషన్స్(shika creations) ఆభరణాలను మాత్రమే కాకుండా విండ్ చైమ్‌లు, డ్రీమ్ క్యాచర్‌లు, వాల్ హ్యాంగింగ్‌లు మొదలైన గృహాలంకరణ వస్తువులను కూడా తయారు చేస్తాం. అయితే స్మృతికి ఈ ఉత్పత్తులను తయారు చేయడంలో 15 మంది పనివారు కూడా ఉన్నారు. వీళ్లు టెర్రకోట ఆభరణాలను డిమాండ్ ని బట్టి తయారు చేస్తారు. ఒక ఆభరణం తయారీకి దాదాపు 5 నుంచి 7 రోజుల సమయం పడుతుంది.

Shika2.jpg

స్మృతికి 1,000 కంటే ఎక్కువ మంది కొనుగోలుదారుల కస్టమర్ బేస్ ఉంది. దాదాపు 300 మందికి టెర్రకోటతో ఎలా పని చేయాలో శిక్షణ ఇస్తారు. అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో ఆఫ్‌లైన్ వర్క్‌షాప్‌లను నిర్వహించింది. మంచి వ్యాపారం చేయాలంటే అనుభవం మాత్రమే కాదు. చేయాలనుకున్న వృత్తి మీద అభిరుచి, ప్రేమా కూడా అవసరమే. అదే వృత్తిలో సెక్సస్ అయ్యేలా విజయాల బాట పట్టిస్తుంది.

Updated Date - 2023-03-08T15:03:24+05:30 IST