Share News

Crime: హత్య కేసులో బెయిల్‌పై వచ్చి చనిపోయినట్టు సీన్ క్రియేట్.. 8 ఏళ్ల తర్వాత పెళ్లికార్డులో చేసిన ఒక్క పొరపాటుతో..!

ABN , First Publish Date - 2023-11-10T15:53:03+05:30 IST

హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ తమిళనాడు వ్యక్తి తాను చనిపోయినట్టు నాటకమాడి 8 ఏళ్ల పాటు తప్పించుకు తిరిగాడు. కానీ ఓ పెళ్లికార్డులో అతడి పేరు నిందితుడిని పోలీసులకు చిక్కేలా చేసింది.

Crime: హత్య కేసులో బెయిల్‌పై వచ్చి చనిపోయినట్టు సీన్ క్రియేట్.. 8 ఏళ్ల తర్వాత పెళ్లికార్డులో చేసిన ఒక్క పొరపాటుతో..!

ఇంటర్నెట్ డెస్క్: అతడు హత్య కేసులో నిందితుడు. బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తరువాత అకస్మాత్తుగా మాయమయ్యాడు. ఆ తరువాత ఎనిమిదేళ్ల పాటు అతడి జాడ కనిపించకపోవడంతో అతడు మృతి చెందాడని బంధువులు స్నేహితులు అనుకున్నారు. పోలీసులూ అదే భావించారు. కానీ, ఓ పెళ్లికార్డుపై జరిగిన పొరపాటుతో బండారం మొత్తం బయటపడిపోయింది. తమిళనాడులో(Tamilnadu) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

Vivek Ramaswamy: నువ్వో చెత్త, నా కూతురి పేరెత్తొద్దు..వివేక్ రామస్వామిపై విరుచుకుపడ్డ అమెరికన్ నేత

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!


కడలూర్ జిల్లాకు చెందిన కె.గణేశ్ 2015లో ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. ఆ తరువాత అతడికి బెయిల్ మంజూరయ్యింది. కానీ, బెయిల్‌పై విడుదలైన కొద్ది రోజులకే అతడు కనిపించకుండాపోయాడు. పోలీసులు ఆ తరువాత చాలా కాలం పాటు అతడి కోసం వెతికినా జాడ కనిపించలేదు. బంధువులు, స్నేహితులకు కూడా అతడి గురించి ఏ సమాచారం అందలేదు. అలా అన్ని జాగ్రత్తలు తీసుకుని తప్పించున్నాడు గణేశ్. దీంతో, అతడి మరణించాడని పోలీసులూ భావించారు. మరోవైపు, గణేశ్ ఏపీలోని నగరికి చేరుకుని మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అతడికి పిల్లలు కూడా కలిగారు. పరిస్థితి ఇలాగే ఉంటే అతడు ఎప్పటికీ దొరికేవాడు కాదేమో గానీ, గణేశ్ బంధువుల ఇంట్లో జరిగిన ఓ పెళ్లి అతడి పుట్టెముంచింది.

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట


ఈ వేడుకకు సంబంధించిన పెళ్లికార్డులో గణేశ్ పేరు ముద్రించారు. కానీ దాని పక్కన లేట్ అని రాయలేదు. దీంతో, పెళ్లికార్డు చూసిన గణేశ్ బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు(tamilnadu man on who presumed dead located due to mistake in wedding card). గణేశ్ చనిపోయినా అతడి పేరు పక్కన ‘లేట్’ అనే పదం ఎందుకు చేర్చలేదో ఎవరికీ అర్థంకాలేదు. అయితే, ఈ ఉదంతం జిల్లా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో, వారు మరో ఆలోచన చేయకుండా గణేశ్ బంధువుల ఫోన్లపై నిఘా పెట్టడంతో గణేశ్ ఆడిన నాటకం మొత్తం బయటపడింది. అతడు ఏపీలోని నగరిలో ఉన్నాడని గుర్తించిన కడలూర్ పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి పోలీసులను అభినందించారు.

Woman Constable: ఈ ఫొటోలోని కానిస్టేబుల్ ఉద్యోగం ఊస్ట్.. తెలియక ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో పోలీస్ శాఖలో హాట్ టాపిక్..!

Updated Date - 2023-11-10T15:53:06+05:30 IST