Tarakaratna: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు?
ABN , First Publish Date - 2023-02-19T17:44:27+05:30 IST
భర్త నందమూరి తారకరత్న (Nandamuri taraka ratna) తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో శోక సంద్రంలో ముగినిపోయిన భార్య అలేఖ్యా రెడ్డి (Alekhya reddy) అస్వస్థకు గురయ్యారు.
హైదరాబాద్: తన జీవిత భాగస్వామి నందమూరి తారకరత్న (Nandamuri taraka ratna) తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో శోక సంద్రంలో ముగినిపోయిన భార్య అలేఖ్యా రెడ్డి (Alekhya reddy) అస్వస్థకు గురయ్యారు. భర్త మరణాన్ని వైద్యులు ధృవీకరించిన శనివారం సాయంత్రం నుంచి ఇంతవరకు ఆమె తినలేదు. దీంతో ఆమె పూర్తిగా నీరసించిపోయారు. దీంతో ఆమె అస్వస్థతకు గురయ్యారు. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అలేఖ్యా రెడ్డిని ఆసుపత్రిలో చేర్చే యోచనలో ఉన్నారు. కాగా కట్టుకున్న భర్త అకాల మరణాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె కంటితడి ఆరడం లేదు. శనివారం నుంచి విలపిస్తూనే ఉన్నారు. బంధులు, అయినవారు ఎంత ధైర్యం చెబుతున్నా... తన జీవిత భాగస్వామి విగతజీవిగా కళ్లముందు కనిపిస్తుండడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోతున్నారు.
ప్రేమ వివాహం ద్వారా ఒక్కటైన జంట..
నందమూరి వంశంలో ప్రేమ వివాహాలు అనేవి లేవు. అన్నీ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లే. కానీ ఆ వంశంలో తొలి సారిగా ప్రేమ వివాహం చేసుకున్న వ్యక్తి తారకరత్న. ఒకప్పటి తన స్నేహితురాలు అలేఖ్యా రెడ్డిని ఆయన 2012 ఆగస్టు 2న హైదరాబాద్‌లోని సంఘీ టెంపుల్‌లో పెళ్లి చేసుకున్నారు. అలేఖ్యా రెడ్డికి అప్పటికే పెళ్లయింది. కానీ విడాకులు తీసుకున్నారు. ఈమె ఎవరో కాదు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి మరదలి కూతురు. కొన్ని చిత్రాలకు కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా ఆమె పని చేశారు. తారకరత్న నటించిన ‘నందీశ్వరుడు’ సినిమాకు కూడా ఆమె వర్క్ చేశారు. తారకరత్న ప్రేమ వివాహంతో ఆగ్రహించిన నందమూరి కుటుంబ సభ్యులు ఆయన్ని కొంత కాలం దూరం పెట్టినా తర్వాత కలసి పోయారు. ఈ దంపతుల ఏకైక కుమార్తె నిష్క.