Viral News: ఓ విద్యార్థి మార్కుల షీట్ పై.. Passed Out అని రాయబోయి.. Passes Away అని రాసిన టీచర్..!
ABN , First Publish Date - 2023-03-29T16:07:16+05:30 IST
భాషను ఉపయోగించేటపుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ అనర్థాలకు దారి తీస్తాయి. అర్థం తెలియకుండా ఉపయోగించే పదం తలనొప్పులు తెచ్చి పెడుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మార్క్ షీట్.. టీచర్ చేసిన ఘోర తప్పిదాన్ని పట్టించింది.
భాషను (Language) ఉపయోగించేటపుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ అనర్థాలకు దారి తీస్తాయి. అర్థం తెలియకుండా ఉపయోగించే పదం తలనొప్పులు తెచ్చి పెడుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మార్క్ షీట్.. టీచర్ (Teacher) చేసిన ఘోర తప్పిదాన్ని పట్టించింది. ఆ టీచర్ పాండిత్యంపై చాలా మంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆ మార్క్ షీట్ (Mark Sheet) 2019 నాటిది అయినప్పటికీ ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది.
ఆ మార్క్ షీట్ ప్రకారం.. ఆ కుర్రాడు 800కి 532 మార్కులు తెచ్చుకున్నాడు. థర్డ్ గ్రేడ్‌లో పాస్ అయి, క్లాస్‌లో 7వ ర్యాంక్ సాధించాడు. ఆ మార్క్ షీట్‌పై టీచర్.. ``పాస్డ్ అవే`` (Passed away) అని రాశారు. నిజానికి అక్కడ ``పాస్డ్ అవుట్`` అని రాయాలనుకుని ``పాస్డ్ అవే`` అని రాశారు. ``పాస్డ్ అవే`` అంటే ``చనిపోయారు`` అని అర్థం. ఆ విషయం తెలియని టీచర్ పాస్డ్ అవే
` అని రాసేశారు. ఆ మార్క్ షీట్ ప్రస్తుతం వైరల్ కావడంతో టీచర్‌పై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
Gold: బంగారం కొనాలనుకుంటున్నారా..? ఈ శనివారం నుంచి కొత్త రూల్.. ఇకపై గోల్డ్ కొనాలంటే..!
2019 నాటి ఆ మార్క్ షీట్ దక్షిణాఫ్రికాలోని ``మలావికి`` చెందినదిగా భావిస్తున్నారు. ఎందుకంటే మార్క్ షీట్‌లో ఉన్న ``చిచెవా`` మలావికి చెందిన అధికారిక భాష. మొత్తానికి టీచర్ చేసిన తప్పు ఎంత అనర్థానికి దారి తీసిందో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.