Viral News: మా అమ్మ మంచం పై నుంచి కింద పడింది.. కాస్త లేపడానికి వస్తారా..? అగ్నిమాపక శాఖకు ఎమర్జెన్సీ కాల్.. వెళ్లి చూస్తే..!

ABN , First Publish Date - 2023-09-08T21:55:54+05:30 IST

160 కేజీల బరువున్న ఓ భారీ మహిళ మంచంపై నుంచి పడి లేవలేకపోవడంతో ఏకంగా అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆమెను మళ్లీ మంచంపైకి చేర్చారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలు అనారోగ్యంతో బాధపడుతూ కొంతకాలంగా మంచానికే పరిమితమైంది.

Viral News: మా అమ్మ మంచం పై నుంచి కింద పడింది.. కాస్త లేపడానికి వస్తారా..? అగ్నిమాపక శాఖకు ఎమర్జెన్సీ కాల్.. వెళ్లి చూస్తే..!

ఇంటర్నెట్ డెస్క్: మా అమ్మ మంచంపై నుంచి కింద పడింది.. కాస్త లేపడానికి వస్తారా? అంటూ అగ్నిమాపక సిబ్బందికి కాల్ వెళ్లింది. వాళ్లకు ఇలాంటి కాల్స్ అప్పుడప్పుడూ వస్తుంటాయి. మంచంపై నుంచి కిందపడి లేవలేని వాళ్లకు అప్పుడప్పుడూ సాయపడుతుంటారు. అయితే, ఈ మారు మాత్రం అగ్నిమాపక సిబ్బందికే బాధితురాలి పరిస్థితి చూసి ఆశ్చర్యం కలిగింది. మహారాష్ట్రలోని థానే(Thane) నగరంలో ఇటీవల ఈ ఘటన వెలుగుచూసింది.


స్థానిక మీడియా కథనాల ప్రకారం బాధితురాలి వయసు 62 ఏళ్లు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నడవలేని స్థితికి చేరుకున్న ఆమె రోజులో అధిగభాగం మంచానికే పరిమితం కావడంతో ఆమె బరువు ఏకంగా 160 కేజీలకు చేరుకుంది(Old Obese woman fell from bed) .

గురువారం ఉదయం ఆమె హఠాత్తుగా మంచం మీద నుంచి పడిపోయింది. ఆమెను మళ్లీ మంచంపై పడుకోబెట్టేందుకు కుటుంబసభ్యులు, ఇరుగుపొరుగు వారు విశ్వప్రయత్నం చేసినా కుదరలేదు. దీంతో, మరోదారి లేని పరిస్థితుల్లో వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు(Fire brigade comes to the rescue). వారు వచ్చి వృద్ధురాలిని యథాస్థానంలో పడుకోబెట్టారు. ఆమె ఏకంగా 160 కేజీల బరువు ఉండటం చూసి వారు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఆ మహిళ మంచం మీద నుంచి పడ్డా ఎటువంటి దెబ్బలు తగలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2023-09-08T21:58:53+05:30 IST