Share News

Year Ender 2024: న్యూ ఇయర్ వేడుకలకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి లోకేషన్ల కోసం చూస్తున్నారా? ఇవిగో ఇవి మీకోసమే

ABN , Publish Date - Dec 23 , 2023 | 10:12 AM

Yearend Travel: మరికొన్ని రోజుల్లో 2023 ఏడాదికి ఎండ్ కార్డ్ వేసి నూతన సంవత్సరానికి(New Year Celebrations 2024) వెల్ కం చెప్పడానికి సిద్ధమయ్యారు దేశ ప్రజలు. సాధారణంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అందరికీ ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి వంటి అనేక రకాల ఆలోచనలు వస్తాయి. అలాంటి వారి కోసమే దేశంలోని టాప్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్ ప్రాంతాలను తీసుకొచ్చాం.. చదివేయండి మరి

Year Ender 2024: న్యూ ఇయర్ వేడుకలకు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి మంచి లోకేషన్ల కోసం చూస్తున్నారా? ఇవిగో ఇవి మీకోసమే

ఢిల్లీ : మరికొన్ని రోజుల్లో 2023 ఏడాదికి ఎండ్ కార్డ్ వేసి నూతన సంవత్సరానికి(New Year Celebrations 2024) వెల్ కం చెప్పడానికి సిద్ధమయ్యారు దేశ ప్రజలు. సాధారణంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే అందరికీ అందరికీ ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి వంటి అనేక రకాల ఆలోచనలు వస్తాయి. అలాంటి వారి కోసమే దేశంలోని టాప్ న్యూఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకునే ప్రాంతాలను తీసుకొచ్చాం.. అవేంటంటే...

1.) గోవా: న్యూ ఇయర్ సెలెబ్రెషన్స్ అంటే తొలుత గుర్తొచ్చేది గోవానే. అక్కడి బీచ్ లు ఆ ఎంజాయ్ మెంట్ గురించి యువతకు వేరే చెప్పనక్కర్లేదు. నూతన సంవత్సరం సెలబ్రేషన్స్ కి బెస్ట్ స్పాట్ గా లిస్టులో టాప్ 1లో నిలిచింది.

2.) ఢిల్లీ: దేశ రాజధానిలో ఉల్లాసభరిత వాతావరణం, స్ట్రీట్ ఫుడ్ కల్చర్ తదితరాలు యువతను ఆకట్టుకుంటాయి. న్యూ ఈయర్ సెలెబ్రేషన్స్ కి ఇదీ బెస్ట్ స్పాటే.

3.) ఉదయ్ పుర్, రాజస్థాన్: మీరు కొత్త సంవత్సరం కోసం సందర్శన స్థలాలు చూస్తున్నట్లయితే, ఉదయ్ పుర్ ఒక అద్భుతమైన ఎంపిక. ఉదయ్ పుర్ సరస్సుల నగరంగా అందమైన భవనాలున్న ప్రాంతంగా పేరుగాంచింది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేందుకు అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది.

4.) అండమాన్ నికోబార్ దీవులు: ప్రపంచంలోని అందమైన బీచ్ లు కలిగిన ప్రాంతంగా అండమాన్ దీవులకు పేరుంది. బీచ్ ల వెంట ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరొచ్చు.

5.) గుల్మార్గ్, కశ్మీర్: న్యూ ఇయర్ సెలబ్రేషన్లకి ఇది బెస్ట్ స్పాట్. మంచు దుప్పటి పరుచుకునే చలికాలంలో ప్రకృతి అందాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు.


6.) పుదుచ్చేరి: పుదుచ్చేరిలో ఉండే బీచ్ లు స్పెషల్ అట్రాక్షన్. నిత్యం బిజీగా ఉండే లైఫ్ కి చిన్న బ్రేక్ చెప్పి కొన్ని రోజుల పాటు పుదుచ్చేరిలో హాయిగా గడపొచ్చు.

7.) కసోల్: పార్వతి లోయ నడిబొడ్డున ఉన్న అత్యంత అందమైన ప్రదేశం ఇది. ట్రెక్కింగ్ చేసేవారికి బెస్ట్ స్పాట్. ఫ్రెండ్స్ అంతా కలిసి ఎంజాయ్ చేయగలిగే మంచి స్పాట్ ఇది.

8.) గోకర్ణం: గోకర్ణం అందమైన బీచ్ లకు నెలవు. కొన్ని రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ ప్రదేశం.

9.) సిక్కిం: మంచుతో కప్పబడిన అందమైన పర్వతాలు సిక్కింలో ఉంటాయి. ఇక్కడే ప్రపంచంలో మూడో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ కాంచన్ జంగా ఉంది. పర్యాటకులు సందర్శించడానికి ఉత్తమ ప్రదేశం ఇది.

10.) ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి పర్యాటకంగా ఎంతో ప్రముఖ్యత కలిగిన నగరం. నైట్ క్లబ్ లు, ఫారేన్ కల్చర్, డ్యాన్సులు, బీచ్ అందాలు ఇవన్నీ మీ న్యూ ఇయర్ సెలెబ్రేషన్‌ని మరింత హుషారుగా మార్చుతాయి.

Updated Date - Dec 23 , 2023 | 10:55 AM