Share News

COVID Infection: 2023లో వ్యాధులకు దూరంగా బతికేస్తున్నాం అంటారా? రాబోయే సంవత్సరానికి ఎన్ని అంటువ్యాధులు కాచుకున్నయో తెలుసా..?

ABN , Publish Date - Dec 23 , 2023 | 11:53 AM

ఈ వ్యాధి మీద 2024లో మరింత శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఇది సోకిన వ్యక్తితో పాటు సాన్నిహిత్యంగా ఉండే ఎవరికైనా వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.

COVID Infection: 2023లో వ్యాధులకు దూరంగా బతికేస్తున్నాం అంటారా? రాబోయే సంవత్సరానికి ఎన్ని అంటువ్యాధులు కాచుకున్నయో తెలుసా..?
COVID Infection

2023 సంవత్సరం పూర్తికావస్తున్న తరుణంలో రాబోయే కొత్త సంవత్సరానికి ఆరోగ్యవిషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని ఈ పాటికే నిర్ణయించుకుని ఉంటారు. జీవనశైలిలో చాలా మార్పులు చేయాలని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని అలవాట్లను మార్చుకోవాలని ఇలా చాలా అనుకునే ఉంటారు. అయితే నిజంగానే అలా ఉండగలమా? గత సంవత్సరం ఎదుర్కొన్న విజయాలు, సవాళ్ళు, ఆరోగ్య విషయంలో ఆలోచిస్తే.. ఆరోగ్యకరమైన జీవనం కోసం కొన్ని తీర్మానాలు చేసుకోవడం మంచిదే. అయితే 2023లో ప్రబలమైన అంటువ్యాధులపై దృష్టి సారించడం కూడా అంతే ముఖ్యం.

MERS ఇన్ఫెక్షన్ ( విడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)

MERS ఇన్ఫెక్షన్ అనేది ఒక రకమైన వైరల్ అంటువ్యాధి. ఇది ఒక రకమైన కరోనా వైరస్ అని చాలా మందికి తెలియదు. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని పేరు పెట్టారు. MERS అనేది Covid - 19 కి సంబంధించిన ఒక ప్రమాదకరమైన ఇన్ ఫెక్షన్, 2023లో ఈ కేసులు పెరిగాయి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ అయినందువల్ల వ్యాధిని నిరోధించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

కోవిడ్ సంక్రమణ..

Covid - 19 కేసులు 2020,2021, 2022 లోనే కాకుండా 2023 లో కూడా ఈ వ్యాధి లక్షణాలు ఏదో రూపంలో కనిపిస్తూనే ఉన్నాయి. 2023లో భారతదేశం యూనైటెడ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాలు Covid - 19 కేసులలో పెరుగుదలను చూశాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనికి రానప్పటికీ 2024లో ఈ వ్యాధి ప్రభావం విపరీతంగా మారినా కూడా తట్టుకునే విధంగా సిద్ధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇది కూడా చదవండి: ఒకే చోట కదలకుండా కూర్చుంటే వచ్చే వెన్నునొప్పికి.. తగ్గాలంటే ఇలా చేయండి..!!

టమోటో జ్వరం

2023లో ఈ టమోటో జ్వరం అనేది పిల్లల్లో బాగా కనిపించింది. దీవివల్ల చాలా రోజుల పాటు ఆరోగ్య భాగాల్లో అంతరాయాలు కలుగుతూ ఉంటాయి. ఈ వ్యాధి మీద 2024లో మరింత శ్రద్ధ అవసరం. ఎందుకంటే ఇది సోకిన వ్యక్తితో పాటు సాన్నిహిత్యంగా ఉండే ఎవరికైనా వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది.

2023లో

అందరినీ కుదిపేసిన మరో అంటువ్యాధి కండ్ల కలక. ఇది పిల్లల్లో కంటే పెద్దవారిలో ఈ సంవత్సరం బాగా కనపించింది. పింక్ ఐ అని కూడా దీనిని పిలుస్తారు. కనురెప్పల లోపలి భాగాలు, బయటి భాగాలు బాగా వాచి ఇన్ఫెక్షన్ కలుగుతుంది. దీనికి కంటికి కళ్ళజోడు ధరించాలి.


(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 23 , 2023 | 01:07 PM