Share News

Viral: విదేశీ టూర్లలో ఈ తప్పు అస్సలు చేయకండి! దానిమ్మ జ్యూస్ ఆర్డరిచ్చిన యువకుడిని ఎందుకు అరెస్టు చేశారంటే..

ABN , First Publish Date - 2023-11-03T17:02:17+05:30 IST

ఫారిన్ టూర్‌కు వెళ్లిన ఓ రష్యా వ్యక్తి స్థానికులతో సంభాషించేందుకు ఓ లాంగ్వేజ్ యాప్ వాడి చిక్కుల్లో పడ్డాడు. పర్యాటకుడు టెర్రరిస్టు అనుకున్న స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రష్యా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు నిజం తెలిసి విడిచిపెట్టారు.

Viral: విదేశీ టూర్లలో ఈ తప్పు అస్సలు చేయకండి! దానిమ్మ జ్యూస్ ఆర్డరిచ్చిన యువకుడిని ఎందుకు అరెస్టు చేశారంటే..

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ టూర్లు వేసే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అనేక దేశాలు కూడా పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక, ఫారిన్ టూర్ల సమయంలో విదేశీయులతో మాట్లాడేందుకు అనేక మంది ఇప్పుడు లాంగ్వేజ్ యాప్‌లపై కూడా ఆధారపడుతున్నారు. కృతిమ మేధ ఆధారంగా నడిచే ఈ యాప్‌లలో మాటలను రికార్డు చేస్తే అవి వాటిని స్థానిక భాషల్లోకి తర్జుమా చేసి అవతలి వారికి వినిపిస్తాయి. ఈ యాప్‌లతో(Language app) భాషాపరమైన అడ్డంకి తొలగిపోవడంతో అనేక మంది వీటిపై అధారపడటం ఎక్కువైంది.

Viral Video: నవ్వుతూనే ఈ పిల్లాడు చెప్పిన మాటలు విని కన్నీళ్లు రావడం ఖాయం.. కారులో కూర్చున్న ఓ యువతి మనసు కరిగిపోయి..!


రష్యాకు చెందిన ఓ వ్యక్తి(Russian) కూడా ఇలాంటి ఓ లాంగ్వేజ్ యాప్ వాడినందుకు చిక్కుల్లో పడాల్సి వచ్చింది. అతడు ఇటీవల పోర్చుగల్(Portugal) పర్యటనకు వెళ్లాడు. లిస్బన్ నగరంలో(Lisbon) పర్యటిస్తూ ఓ రెస్టారెంట్‌లో దానిమ్మ పండు జ్యూస్(Pomegranate Juice) తాగేందుకు వెళ్లాడు. కానీ స్థానిక భాషలో ఆ పండు జ్యూస్‌ను ఏమంటారో అతడికి తెలియక యాప్ సాయం తీసుకున్నాడు. తను చెప్పాలనుకున్నది మాతృభాష అయిన రష్యాలో రికార్డు చేయగా యాప్ దాన్ని తర్జుమా చేసి షాపు అతనికి పోర్చుగీసు భాషలో వినిపించింది.

Viral Video: వారెవ్వా.. ఏం టెక్నిక్ గురూ.. ఇలాంటి టీచర్లు ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడం ఖాయం..!

Shocking: మిల్క్‌షేక్‌ను ఆర్డర్ ఇచ్చిన వ్యక్తికి షాకింగ్ అనుభవం.. ఆ కప్పు నిండా ఏం నింపి పంపారో తెలిస్తే..!


రష్యాలో దానిమ్మ, గ్రెనేడ్‌కు దాదాపు ఒకేలా ధ్వనించే పదం ఉండగా పోర్చుగీసు భాషలో మాత్రం రెండు వేర్వేరు పదాలు ఉన్నాయి. ఈ విషయంలో యాప్ పొరబడటంలో రష్యా యువకుడు చిక్కుల్లో పడ్డాడు. యాప్‌ చెప్పింది విన్న రెస్టారెంట్ వెయిటర్‌కు(Waiter) రష్యా వ్యక్తి తనను గ్రెనేడ్(Granade) విసిరి చంపుబోతున్నాడని అర్థమైంది. దీంతో, భయపడ్డ అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే వాళ్లు వచ్చి అతడిని స్టేషన్‌కు(Arrest) తీసుకెళ్లారు. అక్కడి అతడిని పోలీసులు వివిధ రకాల ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే, అతడి వద్ద ఎటువంటి ఆయుధం లేకపోవడంతో పాటూ అతడిపై ఎటువంటి కేసులూ లేవని తేలడంతో వదిలిపెట్టేశారు. దీంతో, ఈ దెబ్బకు దిమ్మతిరగడంతో రష్యా వ్యక్తి బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి బయటపడ్డాడు.

Shocking Video: ఖర్మ ఫలితం అంటే ఇదేనేమో.. హాయిగా నిద్రపోతున్న పాండాను కావాలని డిస్టర్బ్ చేసిన కుర్రాడు.. చివరకు..

Updated Date - 2023-11-03T17:03:32+05:30 IST