patal lok: ఎట్టకేలకు పాతాళలోకం జాడ తెలిసిందోచ్... అది ఎక్కడ ఉంది? ఎంత లోతులో ఉంది? ఎలా కనుగొన్నారో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-18T08:01:07+05:30 IST

patal lok: భూమి కింద పాతాళలోకం అని పేర్కొనే మరో ప్రపంచం(world) ఉందని అంటారు. అయితే ఈ ప్రపంచం ఎక్కడ ఉంది? ఆ రహస్యాలను(Secrets) మనం

patal lok: ఎట్టకేలకు పాతాళలోకం జాడ తెలిసిందోచ్... అది ఎక్కడ ఉంది? ఎంత లోతులో ఉంది? ఎలా కనుగొన్నారో తెలిస్తే...

patal lok: భూమి కింద పాతాళలోకం అని పేర్కొనే మరో ప్రపంచం(world) ఉందని అంటారు. అయితే ఈ ప్రపంచం ఎక్కడ ఉంది? ఆ రహస్యాలను(Secrets) మనం ఇప్పుడు తెలుసుకుందాం. అదే మరియానా ట్రెంచ్(Mariana Trench). అది ఎంత లోతైన కందకం అంటే దీనిలో ఎవరెస్ట్ పర్వతం(Mount Everest) మొత్తం ఇమిడిపోతుంది.

యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్(University of Washington) తెలిపిన వివరాల ప్రకారం మరియానా ట్రెంచ్ 2550 కిలోమీటర్ల లోతు కలిగి మరియానా దీవులకు తూర్పున ఉంది. నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) తెలిపిన వివరాల ప్రకారం మరియానా ట్రెంచ్‌లోని లోతైన ప్రదేశం ఛాలెంజర్ డీప్(Challenger Deep) అనే బేసిన్‌లో ఉంది. ఇది ట్రెంచ్‌కు దక్షిణ చివరలో ఉంది.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం అది అత్యంత లోతైనదని అంచనా వేశారు. దీని లోతుకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలు(Statistics) ఎవరి వద్దా లేవు. NOAA ప్రకారం ఛాలెంజర్ డీప్ ఉపరితలం నుండి 10,935 మీటర్ల వరకు విస్తరించి ఉంది. ఈ అంచనా జర్నల్ డీప్ సీ రీసెర్చ్ పార్ట్ 1లోని ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్(Oceanographic Research) పేపర్‌ల ఆధారంగా గుర్తించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం తొలుత 1960లో ఇక్కడ లోతును కొలవడానికి ప్రయత్నించినప్పుడు, దాని లోతు 10,911 మీటర్లుగా అంచనా వేశారు.

సముద్రం(sea)లో లోతును తెలుసుకోవడానికి సోనార్ కిరణాలను ఉపయోగిస్తారు. అయితే ఛాలెంజర్ డీప్ లోతును అంచనా వేయడం సవాలు(challenge)తో కూడుకున్నది. వాస్తవానికి, NOAA కార్ప్స్ ప్రకారం సముద్రపు లోతును తెలుసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ముందుగా సోనార్ (Sonar)సాయంతో లోతును గుర్తించే ఓడ... తర్వాత సముద్రపు అడుగుభాగంలో ఉంచిన ప్రెజర్ సెన్సార్(Pressure sensor) సాయం... వీటి ఆధారంగా దాని పైన ఎంత నీరు ఉందో తెలుస్తుంది. ఛాలెంజర్ డీప్‌లో సోనార్ కిరణాలు విడుదలైనప్పుడు, వాటి తరంగాలు(waves) దిగువకు తాకి తిరిగి రావడానికి 14 సెకన్లు పట్టిందని తెలిస్తే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దీని ప్రకారమే ఈ పాతాళ లోకపు(Underworld) లోతును అంచనావేశారు.

Updated Date - 2023-03-18T08:05:22+05:30 IST