Viral Photo: అమ్మకానికి ఫ్రిడ్జ్.. అంటూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్ట్.. అసలు ఫ్రిడ్జ్ ఎక్కడుంది బాబూ.. అంటూ నెటిజన్ల సెటైర్లు..!
ABN , First Publish Date - 2023-03-10T14:59:16+05:30 IST
కొన్ని ఫొటోలు, బొమ్మలు చాలా గందరగోళంగా ఉంటాయి. మనమేం చూస్తున్నామో మనకే తెలియదు.. కొన్ని సార్లు మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఫోటోయే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్ని ఫొటోలు, బొమ్మలు చాలా గందరగోళంగా ఉంటాయి. మనమేం చూస్తున్నామో మనకే తెలియదు.. కొన్ని సార్లు మన కళ్లే మనల్ని మోసం చేస్తాయి. దానినే ఆప్టికల్ ఇల్యూషన్ (Optical illusion) అంటారు. ప్రస్తుతం అలాంటి ఫోటోయే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఓ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసి ``ఫ్రిడ్జ్ అమ్మకానికి ఉంది`` (Fridge For Sale) అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ ఫొటో చూసినవారెవరూ ఆ ఫొటోలో ఉన్న ఫ్రిడ్జ్‌ను గుర్తించలేకపోయారు. కొంతమంది ఐదు నిమిషాల తర్వాత కూడా ఆ ఫొటోలో ఫ్రిడ్జ్ ఉందా? లేదా? అనే అనుమానంలోనే ఉండిపోయారు.
@rahulpassi అనే వ్యక్తి ఆ ఫొటోను ట్వీట్ చేసి ఆ పొటోలో ఫ్రిడ్జ్ ఉందని కనుగొనడానికి తనకు ఐదు నిమిషాలు పట్టిందని పేర్కొన్నారు (Big Fridge in the Picture). ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు 18 వేలకు పైగా లైక్‌లు, 1600 కంటే ఎక్కువ రీట్వీట్లు వచ్చాయి. అలాగే, వందలాది మంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇప్పటికైనా మీరు ఆ ఫొటోలోని ఫ్రిడ్జ్‌ను కనుగొన్నారా? లేకపోతే కింది ఫొటో చూడండి..