Year Ender 2023: 2023లో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలు ఇవేనట.. !!
ABN , Publish Date - Dec 22 , 2023 | 03:45 PM
స్విగ్గి బెంగళూరు నివాసి నుండి అందుకున్న అతిపెద్ద ఆర్డర్ విలువ INR 75,378.
మరో సంవత్సరం గడిచిపోయింది. రాబోతున్న నూతన సంవత్సరానికి సాధరంగా ఆహ్వానం పలుకుతూ, గడిచిన ఏడాదిలో కడుపునిండా తిన్న పదార్థాలు, ఆర్డర్స్ చేసిన ఐటమ్స్ గురించి పెద్ద జాబితానే ఉంది. ప్రతి ఒక్కరికీ ఆహారం ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఆన్‌లైన్ డెలివరీ మార్కెట్ పెరిగింది. 2023 ప్రపంచ కప్ సమయంలో స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ సఫ్లయ్ చేసే యాప్స్ ద్వారా , చాలా పిజ్జా, బిర్యానీలు ఆర్డర్ వచ్చాయని జాబితాను విడుదల చేసింది.
2023లో అత్యధికంగా ఆర్డర్ చేసిన పదార్థాల లిస్ట్..
కొంతమంది బయటి నుండి ఆర్డర్ చేసి రికార్డులను బద్దలు కొట్టారు. అత్యధిక సంఖ్యలో కేక్‌లను (1,098) ఆర్డర్ చేయడం, ఫుడ్ ఆర్డర్‌ల కోసం 28 లక్షలకు పైగా ఖర్చు చేయడం నుండి అత్యధిక విలువైన ఆర్డర్, దేశంలోని అతిపెద్ద ఆహార ప్రియుల వరకు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు Swiggy వార్షిక ట్రెండ్స్ రిపోర్ట్‌లలో చేసింది.
అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారానికి అవార్డు..
గత సంవత్సరం మాదిరిగానే, భారతీయులకు బిర్యానీ అగ్ర ఎంపికగా నిలిచింది. స్విగ్గీ తన యాప్‌లో ప్రతి నిమిషానికి బిర్యానీ కోసం దాదాపు 137 ఆర్డర్‌లు వస్తున్నట్లు నమోదు చేసింది. Zomato నుండి ప్రతి నిమిషానికి 186 బిర్యానీ ఆర్డర్‌లు డెలివరీ చేస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా జొమాటో దేశవ్యాప్తంగా 16,514 బిర్యానీలకు ఆర్డర్లు అందుకుంది.
న్యూ ఇయర్ పార్టీ కోసం పిజ్జా
స్విగ్గీ లెక్కల ప్రకారం, కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా 2.5 లక్షల పిజ్జాలు అమ్ముడయ్యాయి. Zomato అతి పెద్ద పిజ్జాల ఆర్డర్‌ను అందుకుంది, ఈ ఆర్డర్ ధర సుమారు INR 25,000.
కేక్
ఈ సంవత్సరం‘రాహుల్’ అనే వ్యక్తి జొమాటో యాప్ ద్వారా దాదాపు 1,098 కేక్‌లను ఆర్డర్ చేశాడు.
సంవత్సరంలో అతిపెద్ద ఆహార ప్రియుడు ఎవరంటే..
జొమాటోలో రూ. 28 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆహారాన్ని ఆర్డర్ చేసిన పూణే నివాసికి ఈ సంవత్సరం ఆహార ప్రియుడి అవార్డు దక్కింది. ఇలాగే పెద్ద పిజ్జా ఆర్డర్‌తో పాటు, స్విగ్గి బెంగళూరు నివాసి నుండి అందుకున్న అతిపెద్ద ఆర్డర్ విలువ INR 75,378. పూణే నివాసి కూడా తన జట్టు సభ్యుల కోసం INR 71,229 విలువైన బర్గర్‌లు, ఫ్రైలను ఆర్డర్ చేశాడు.