Time traveller: ఈ ఏడాది ఈ అయిదు సంఘటనలు జరిగితీరుతాయట.. డేట్స్ తో సహా షాక్ ఇస్తున్న టైం ట్రావెలర్...

ABN , First Publish Date - 2023-02-24T14:31:23+05:30 IST

గ్రహాంతర వాసులు ఈ నెల లోనే మన చెంతకు వస్తున్నారు

Time traveller: ఈ ఏడాది ఈ అయిదు  సంఘటనలు జరిగితీరుతాయట.. డేట్స్ తో సహా షాక్ ఇస్తున్న టైం ట్రావెలర్...

మన బాలయ్య బాబు టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో ఆదిత్య 369సినిమా తీశారు. అందులో గతంలోకి మాత్రమే కాకుండా భవిష్యత్తుకూ వెళ్ళి రాబోయే కాలం ఎలా ఉంటుందో చూపిస్తారు. అయితే రియల్ గా ఈ టైం ట్రావెలింగ్ గురించి చాలా మంది చెబుతున్నా పెద్దగా ఆధారాలు లేవు. కానీ ఒక వ్యక్తి మాత్రం తాను 2858 సంవత్సరం వరకు ప్రయాణం చేశానని చెప్పాడు. అంతవరకు బానే ఉన్నా ఈ ఏడాది ఈ అయిదు పెద్ద సంఘటనలు జరుగుతాయని డేట్స్ తో సహా చెప్పి షాకిస్తున్నాడు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

ఓ వ్యక్తి టైమ్ ట్రావెలింగ్ చేశానని చెబుతున్నాడు. ఇతను 2858 సంవత్సరం వరకు ప్రయాణం చేసి వచ్చానని చెప్పాడు. ఇదంతా ఫేక్ అని అందరూ ఇతని మాటను కొట్టి పారేస్తుండటంతో ఇతను మరొక అడుగు ముందుకు వేసి అయిదు ముఖ్యమైన తేదీలు చెప్పి ఆ తేదీలలో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాడు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Read also: అమ్మోబొమ్మ.. అక్కడికి వెళ్ళగానే వణికిపోతూ ఏడ్చేస్తున్నారు అందరూ.. కారణమేమిటంటే..


ఫిబ్రవరి 28, 2023లో గ్రహాంతర వాసులు ఏదో ఒక రూపంలో భూమిపైకి వస్తారని ఇతను చెప్పాడు.

ఏప్రిల్ 2, 2023 తేదీన శాస్త్రవేత్తలు ఆక్సిజన్ కు ప్రత్యామ్నాయాన్ని కనుక్కుంటారని చెప్పాడు. దీనివల్ల మనిషి జీవితకాలం మరొక 50ఏళ్ళు పెరుగుతుందట.

మే4, 2023 న అంగారక గ్రహంపైన ఎముకల కుప్పలు కనిపిస్తాయట. ఈ ఎముకల కుప్పల ఆధారంగా మానవులు అంగారక గ్రహానికి చెందినవాళ్ళనే విషయం రుజువు అవుతుందట.

ఆగష్టు 26, 2023 1.5మిలియన్ సంవత్సరాల కిందట కనుగొనబడిన మెగాలోడాన్ సొరచేపలు మరియానా ట్రెంచ్ దిగువ ప్రాంతంలోమళ్ళీ కనబడతాయట.

ఇక చివరగా అక్టోబర్ 16, 2023న కొంతమంది యూత్ కు పురాతన శిథిలాలలో ఒక రాయి లభిస్తుందట. ఈ రాయి సహాయంతో టైం ట్రావెల్ సాధ్యమవుతుందట.

ఇలా అయిదు ముఖ్యమైన విషయాలు చెప్పి ఇవన్నీ నిజమవుతాయని అతను అన్నాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు ఇదంతా ఫేక్ అంటుంటే మరికొందరు మాత్రం ఈ భూమి మీద సాధ్యం కానిది ఏముంది ఏమో గుర్రం ఎగరావచ్చు అనేలా చెబుతున్నారు. కొందరు భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి కదా ఫేక్ అని ఎలా అంటారు, జరిగే అవకాశంఉండచ్చనేది కొందరివాదన. వీటన్నిటికి సమాధానం కావాలంటే ఈ ఏడాదిలో అతడు చెప్పిన డేట్స్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే..

Updated Date - 2023-02-24T14:31:26+05:30 IST