Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-07-12T07:54:39+05:30 IST

నేడు (12-7-2023 - బుధవారం) కొన్ని రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంది. అంతేకాదు.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయట. ఇక వృషభ రాశివారు అన్నదమ్ములకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (12-7-2023 - బుధవారం) కొన్ని రాశుల వారికి ఆర్థికంగా చాలా బాగుంది. అంతేకాదు.. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయట. ఇక వృషభ రాశివారు అన్నదమ్ములకు సంబంధించి కీలక సమాచారం అందుకుంటారట. ఇక మిగిలిన అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి లాభాలు ఆ్జస్తారు. సకాలంలో నిధులు చేతికి అందుతాయి. ఫర్నీచర్‌ కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కొత్త ఆలోచనలు అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. అన్నదమ్ములకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వాహనం కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూల సమయం. లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు కావలసిన నిధులు సర్దుబాటవుతాయి. విరాళాలు, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. సంగీతం, పెయింటింగ్‌, ఫొటోగ్రఫీ, వీడియో, టెక్స్‌టైల్స్‌, గనుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. కంపెనీలు, సహకార సంఘాల వారికి అనుకూ సమయం. బృందకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా రంగాలకు చెందిన ప్రముఖులను కలుసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. గౌరవ మన్ననలు అందుకుంటారు. సంకల్పం ఫలిస్తుంది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. పోలీసులు, కన్సల్టెంట్‌లు, ఉన్నత విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్యకు అ వసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. లక్ష్యాలు సాధిస్తారు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణాలు మంజూరవుతాయి. పన్నుల వ్యవహారాలు పరిష్కారం అ వుతాయి. ఆ రోగ్యం మెరుగవుతుంది. స్టాక్‌మార్కెట్‌, ఇన్సూరెన్స్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం ఫలిస్తుంది.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

నలుగురిలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి కొత్త పరిచయాలు లాభిస్తాయి. బృందకార్యక్రమాల్లో సన్నిహితులను కలుసుకుంటారు. స్పెక్యులేషన్లు లాభిస్తాయి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఆస్పత్రులు, కేటరింగ్‌, హోటల్‌ రంగాల వారికి ఆర్థింకంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వైద్య సేవలకు కావలసిన నిదులు సర్దుబాటు అవుతాయి. పనివారి నియామకానికి అనుకూలం. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పిల్లల విద్యా విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిట్‌ఫండ్‌లు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకలు ఆనందం కలిగిస్తాయి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఇంటికి అవసరమైన వస్తువుల సమకూర్చుకుంటారు. కోరుకున్న చోటుకు బదిలీ అ వుతారు. సీటు మార్పునకు అనుకూల సమయం. ఇల్లు, స్థల సేకరణకు సంబంధించి ఆలోచిస్తారు. పనితీరులో మార్పులు, చేర్పుల వల్ల మంచి జరుగుతుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రియతముల నుంచి మెయిల్స్‌, వాట్సాఫ్‌ సందేశాలు అందుకుంటారు. సన్నిహితులకు సంబంధించి ముఖ్యమైన వార్త అందుకుంటారు. రిజిస్ట్రేషన్లు, రాతకోతలకు అనుకూలం, సంకల్పం నెరవేరుతుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-07-12T08:03:23+05:30 IST