Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-07-22T07:15:44+05:30 IST
నేడు (22-7-2023 - శనివారం) సింహరాశి వారికి ఓ విషయంలో జాగ్రత్త సూచించడం జరిగింది. ఇక మేష రాశివారు ప్రియతముల ఆరోగ్యం విషయంలో కొంత కలవరపాటుకు గురవుతారు. వృషభరాశి వారి విషయానికి వస్తే.. ఇవాళ విద్యార్థులకు శుభప్రదంగా ఉంది. ఇక అసలు అన్ని రాశుల వారి రాశి ఫలాలు పూర్తి స్థాయిలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
నేడు (22-7-2023 - శనివారం) సింహరాశి వారికి ఓ విషయంలో జాగ్రత్త సూచించడం జరిగింది. ఇక మేష రాశివారు ప్రియతముల ఆరోగ్యం విషయంలో కొంత కలవరపాటుకు గురవుతారు. వృషభరాశి వారి విషయానికి వస్తే.. ఇవాళ విద్యార్థులకు శుభప్రదంగా ఉంది. ఇక అసలు అన్ని రాశుల వారి రాశి ఫలాలు పూర్తి స్థాయిలో ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. హోటల్, ఆస్పత్రులు, సేవల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
వివాహాది శుభకార్యాలకు ఏర్పాట్లు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చిన్నారుల వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. విద్యా సంస్థలు, చిట్ఫండ్లు, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులకు శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం పాటించాలి. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చే స్తారు. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. సోదరీ సోదరుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు ఏర్పాట్లు చే సుకుంటారు. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త పాటించాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా వుంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు మనసుకు ప్రశాంతత చేకూరుస్తాయి. వేడుకల్లో పాల్గొంటారు. దూరంలో వున్న బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కొత్త ఆలోచనల అ మలుకు ఇది తగిన సమయం కాదు. ఆంజనేయ స్వామిని దర్శించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాలకు సంబంధించి రహస్య సమాచారం అందుకుంటారు. దూరంలో వున్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. సినీ, రాజకీయ, న్యాయ, బోధన, విదేశీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. వేడుకల్లో ఖర్చులు అధికం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహరాల్లో పెద్దల సహకారం ల్డపిస్తుంది. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి, వ్యాపారాల్లో అనుకున్న పనులు సాధిస్తారు. పెద్దలతో చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. గౌరవ పదువులు అందుకుంటారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్ప సాధనకు అధికంగా శ్రమించాలి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రక్షణ, బోధన, న్యాయ, రవాణా, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో వేడుకలు, సంస్మరణల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలి.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
స్టాక్‌మార్కెట్ లావాదేవీల పై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. పన్నులు, మ్యూచ్యువల్ పండ్స్, పెన్షన్ లావాదేవీల్లో నిదానం పాటించాలి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాలు లక్ష్య సాధనకు తోడ్పడతాయి. వివాహ నిర్ణయాలకు అనుకూలం. సమావేశాలు, వేడుకలు, విందులు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రత్యర్థులపై ఒక కన్నేసి ఉంచాలి. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనుబంధాలు బలపడతాయి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ