Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-08-07T07:33:16+05:30 IST

నేడు (7 - 8 - 2023 - సోమవారం) మేషరాశివారు చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశివారు ఉన్నత పదవులు అందుకుంటారు.

Horoscope : రాశిఫలాలు

నేడు (7 - 8 - 2023 - సోమవారం) మేషరాశివారు చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. మిథునరాశి వారి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మకర రాశివారు ఉన్నత పదవులు అందుకుంటారు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ కొన్ని రాశుల వారికి సూచనలు చేయడం జరిగింది. అవేంటో తెలుసుకోండి.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల విషయంలో శుభపరిణామాలు సంభవం. మీ లోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల ఆంతరంగిక విషయాలు చర్చకు వస్తాయి. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరం. దూరంతో ఉన్న ప్రియతముల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశివారికి ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బృందకార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ప్రియతముల కోసం విలువైన వుస్తువులు సమకూర్చుకుంటారు. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

పదిమందిలో గౌరవ, మన్ననలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఉన్నత పదవుల కోసం చే సే ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు లాభిస్తాయి. అదనపు ఆదాయం లభిస్తుంది. సాంబశివుని ఆరాదన మంచిది.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. విద్యార్థులకు శుభప్రదం. ప్రయాణాలు చర్చలకు అనుకూలం. దుర్గా దేవి ఆరాధన మంచిది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ప్రోత్సాహకరంగా వుంటుంది. బీమా, పన్నులు, మ్యూచ్యువల్‌ ఫండ్‌ల గురించి ఆరా తీస్తారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. దానధర్మాలకు ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. శివుడి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. సమావేశాల్లో, వేడుకల్లో గౌరవ, మన్ననలు అందుకంటారు. వేడుకల్లో పాల్గొంటారు. పందాలు, పోటీల్లో విజయం వరిస్తుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

సినీ, రాజకీయ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. విదేశీ గమన యత్నాలు ఫలిస్తాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. వృత్తి, వ్యాపారాలకు సంబంధించి రహస్య సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. ప్రేమలు ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రియతముల సహకారం లభిస్తుంది. చిట్‌ఫండ్‌లు, బోధన, బ్యాంకింగ్‌, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత పదవులు అందుకుంటారు. పెద్దలు, తల్లిదండ్రుల సూచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగం విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. పైఅధికారుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. ఏజెన్సీలు, మార్కెటింగ్‌, బోధన, రవాణా రంగాల వారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలు, చర్చలు, విద్యా విషయాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. మహాదేవుడి ఆరాధన శుభప్రదం.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో శుభపరిణమాలు సంభవం. పెట్టుబడులు లాభిస్తాయి. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. రుద్రకవచపారాయణ మంచిది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-08-07T07:36:31+05:30 IST