Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-08-08T08:03:08+05:30 IST

నేడు (8-8-2023 - మంగళవారం) మేషరాశి వారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృషభ రాశి వారు సూచించిన రంగాల్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇక సింహరాశి వారికి నేడు ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Horoscope : రాశిఫలాలు

నేడు (8-8-2023 - మంగళవారం) మేషరాశి వారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వృషభ రాశి వారు సూచించిన రంగాల్లో ఉంటే మాత్రం తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇక సింహరాశి వారికి నేడు ప్రతి విషయంలోనూ ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, జ్యుయలరీ రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. మనశ్శాంతి లోపిస్తుంది. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు, చర్చలు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. సినిమాలు, రాజకీయ రంగాల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

సమావేశాలు, వేడుకల కోసం ఖ ర్చులు అంచనాలు మించుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి అనుకోని ఆంటకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో పెద్దల సహకారం లో పిస్తుంది, ప్రభుత్వ సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. దుర్గా దేవి ఆరాధన మంచిది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించాలి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయ్యే అవ కాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అనుకోని అ వాంతరాలు ఎదురవుతాయి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. దుర్గాదేవిని దర్శించండి.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

వైద్యానికి ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. ప్రియతముల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. హనుమాన్‌ చాలీసా పారాయణ మంచిది.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా ఆ వేదనకు గురవుతారు. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. కోర్టు కే సుల కారణంగా చిక్కులు ఎదురవుతాయి. సమావేశాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షణల వల్ల ఫలితం ఉంటుంది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాల్లో పరిమితి పాటించాలి. వ్యవసాయం. పరిశ్రమల రంగాల వారికి అనుకోని అొంతరాలు ఎ దురయ్యే అ వకాశం ఉంది. సహోద్యోగుల కారణంగా చిక్కులు ఎదురవుతాయి. ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. దుర్గా స్తోత్ర పారాయణ మేలు చేస్తుంది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. టెలివిజన్‌, క్రీడలు, విద్యా రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం కాదు.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. సమావేశాలకు ఏర్పాట్లలో చిక్కులు ఎదురయ్యే అ వకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు సన్నిహితుల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు. వసతి లోపం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్‌ లో జాగ్రత్తలు పాటించాలి. కమ్యూనికేషన్లు, స్టేషనరీ, రవాణా రంగాల వారికి కొంత నిరుత్సాహంగా ఉంటుంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-08-08T08:06:51+05:30 IST