Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-08-16T08:33:40+05:30 IST
నేడు (16-8-2023 - బుధవారం) మేష రాశివారికి పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. అలాగే వృషభ రాశి వారికి క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. తుల రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారు నేడు అన్ని వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు (16-8-2023 - బుధవారం) మేష రాశివారికి పెద్దగా ఆశాజనకంగా ఏమీ లేదు. అలాగే వృషభ రాశి వారికి క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. తుల రాశివారికి ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక సింహరాశి వారు నేడు అన్ని వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
షాపింగ్ కోసం ఖర్చులు అధికం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు అధికంగా శ్రమించాలి. చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడుల్లో నిదానం అెసరం. గణపతి ఆలయాన్ని దర్శించండి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. భూములు, ఇళ్ల క్రయ విక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అ వకాశం ఉంది. హార్డ్‌వేర్, నిర్మాణ సామగ్రి, ఫర్నీచర్ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. అద్దె వ్యవహారాలు పరిష్కారం అ వుతాయి. అన్నదానం శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
డ్రైవింగ్‌లో నిదానం పాటించండి. రాతకోతల్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. చెక్కులు, పత్రాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బంది పడతారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఆరాధించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. డబ్బు విషయంలో సన్నిహితులు మొహమాటపెట్టే అ వకాశం ఉంది. విలాలసాకు ఖర్చు చేస్తారు. శ్రీ వేంకటేశ్వర కవచ పారాయణ చేయండి.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వ్యక్తిగత సౌకర్యాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలకు అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించడతో మనోవేదనకు గురవుతారు. గోసేవ మంచిది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
దూరప్రయాణాలు, విదేశీ వ్యవహరాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సినీ, రాజకీయ రంగాల వారు కొంత నిదానం పాటించాలి. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా పూర్తవుతాయి. యోగధ్యానాలకు అనుకూల సమయం.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువుల కొనుగోలు సమయంలో నాణ్యతను గమనించాలి. ఫైనాన్స్, చిట్ఫండ్లు, వడ్డీ వ్యాపారులు జాగ్రత్తలు పాటించాలి. గణపతి ఆరాధన శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకోని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. ప్రభుత్వ సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గౌరవమర్యాదలకు భంగం కలగడచ్చు. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కన్సల్టెన్సీలు, విద్యాసంస్థలు, ఈ వెంట్ మేనేజ్మెంట్ రంగాల వారు జాగ్రత్తగా వ్యవహరించాలి. సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. గణపతిని ఆరాధించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. సకాలంలో డబ్బు చేతికి అందక కొంత ఇబ్బంది పడతారు. పన్నులు, బ్యాంక్లోన్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి. పెన్షన్, మెడికల్ క్లెయిములు వ్యవహారాలు పరిష్కారం అ వుతాయి. గోసేవ వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదరయ్యే అ వకాశం ఉంది. న్యాయ వివాదాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితులు మిమ్మల్ని అపార్థం చేసుకునే అ వకాశం ఉంది. పందాలు పోటీలకు దూరంగా ఉండాలి. మహావిష్ణువు ఆరాదన మేలు చేస్తుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
సన్నిహితుల ఆ రోగ్యం పట్ల శ్రద్ద చూపించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురయ్యే అ వకాశం ఉంది. సహోద్యోగుల నుంచి చిక్కులు ఎదురవుతాయి. ఫార్మా, హాస్టళ్లు, ఆహార రంగ వ్యాపారులకు కొంత నిరాశ ఎదరయ్యే అవకాశం ఉంది. గణపతి ఆరాధన శుభప్రదం.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ