Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-09-22T08:05:02+05:30 IST

నేడు (22-9-2023 - శుక్రవారం) మేష రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. వృషభ రాశివారికి పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఇవాళ చాలా అనుకూలమైన రోజు.

Horoscope : రాశిఫలాలు

నేడు (22-9-2023 - శుక్రవారం) మేష రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. వృషభ రాశివారికి పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు ఇవాళ చాలా అనుకూలమైన రోజు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సమావేశాలు, విందుల్లో పాల్గొంటారు. కళా సాంస్కృతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. దుర్గామాత ఆరాదన మంచిది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పన్నుల వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. వాయిదాల పద్ధతిపై విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బ్యాంకులు, చిట్‌ఫండ్‌ కంపెనీలతో పనులు పూర్తి అవుతాయి. అడ్వర్టయిజ్‌మెంట్‌, క్రీడలు, హార్డ్‌వేర్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. న్యాయ వివాదాలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. భాగస్వామితో కుటుంబ విషయాలు చర్చిస్తారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ములతో ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. ఫార్మా, ఆహార పరిశ్రమల ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కీలకమైన సందేశాలు అందుకుంటారు. లక్ష్మీదేవి ఆరాధన మంచిది.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

క్రీడలు, అడ్వర్టయిజ్‌ మెంట్‌లు, పాఠశాలలు, స్టేషనరీ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. విద్యకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి. లలితా సహస్రనామ పారాయణ మంచిది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరి గురించి ఆలోచిస్తారు. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనసు మార్పును కోరుకుంటుంది. కనకధారా స్తోత్ర పారాయణ మంచిది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. సంభాషణలు, సందేశాలు ఆనందం కలిగిస్తాయి. విద్యాసంస్థల ఉద్యోగులు, కమ్యూనికేషన్‌ రంగ వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్మీదేవిని ఆరాధించండి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఇంక్రిమెంట్లు అందుకుంటారు. బంధుమిత్రులతో షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, మ్యూచ్యువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుకూలమైన రోజు. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. లలితా దేవి ఆరాధన మంచిది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం. సంకల్పం నెరవేరుతుంది. లక్ష్య సాధనలో పెద్దల సహకారం అందుకుంటారు. లలితా దేవి ఆరాధన శుభప్రదం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఫొటోగ్రఫీ, గ్రానైట్‌, ఎఠిుమతులు, పూజాద్రవ్యాల వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీసా, పాస్‌పోర్ట్‌ వ్యవహారాలు పూర్తవుతాయి. దూరప్రయాణాలకు సంబంధించిన చర్చలు, డాక్యుమెంటేషన్‌కు అనుకూలం. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు, విలువైన వస్తువులు కొనుగోలుకు అనుకూల సమయం. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. విరాళాలు, సేవా కార్యక్రమాలు కోసం వెచ్చిస్తారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో వేడుక లు, వి వాహ ఏర్పాట్లుపై ఒక నిర్ణయానికి వస్తారు. పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వేడుకల్లో కీలకపాత్ర పోషిస్తారు. భాగస్వామి సహకారంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. లక్ష్మీదేవిని ఆరాధించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-09-22T08:09:52+05:30 IST