Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-10-06T07:48:16+05:30 IST
నేడు (6-10-2023 - శుక్రవారం) మేషరాశి వారికి కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి.
నేడు (6-10-2023 - శుక్రవారం) మేషరాశి వారికి కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. వృషభ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఇక సింహరాశి వారు ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. సమావేశాలకు ఏర్పాట్లలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు సన్నిహితుల నుంచే సమస్యలు ఎదుర్కొంటారు. వసతి లోపం కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి. దుర్గామాతను దర్శించండి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ లో జాగ్రత్తలు పాటించాలి. కమ్యూనికేషన్లు, స్టేషనరీ, రవాణా రంగాల వారికి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. లలితా దేవి ఆరాధన మేలు చేస్తుంది.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావచ్చు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, జ్యుయలరీ రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. మనశ్శాంతి లో పిస్తుంది. దుర్గామాత ఆలయ దర్శనం శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య విదేశీ వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు, చర్చలు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు అవసరం. సినిమాలు, రాజకీయ రంగాల వారికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. దుర్గాష్టక పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
సమావేశాలు, వేడుకల కోసం ఖ ర్చులు అంచనాలు మించుతాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి అనుకోని ఆంటకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. కనకధారా స్తోత్రపారాయణ మంచిది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో పెద్దల సహకారం లో పిస్తుంది, ప్రభుత్వ సంస్థల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. లలితాదేవి ఆరాదన మంచిది,
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించాలి. లక్ష్య సాధనలో ఆటంకాలు ఎదురయ్యే అవ కాశం ఉంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో అనుకోని అ వాంతరాలు ఎదురవుతాయి. ఒక సమాచారం కలవరం కలిగిస్తుంది. గాయత్రీమాతను ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
వైద్యానికి ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. ప్రియతముల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. రుణ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి కారణంగా ఆ వేదనకు గురవుతారు. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. కోర్టు కే సుల కారణంగా చిక్కులు ఎదురవుతాయి. సమావేశాల్లో జాగ్రత్తలు పాటించాలి. కనక ధారా స్తోత్ర పారాయణ శుభఫలితాను ఇస్తుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
విందు వినోదాల్లో పరిమితి పాటించాలి. వ్యవసాయం. పరిశ్రమల రంగాల వారికి అనుకోని అవాంతరాలు ఎ దురయ్యే అవకాశం ఉంది. సహోద్యోగుల కారణంగా చిక్కులు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. లలితా మాతను ఆరాధించండి.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆ వేదన కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించుతాయి. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. టెలివిజన్, క్రీడలు, విద్యా రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం కాదు. అమ్మవారి ఆలయాన్ని దర్శించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ