Horoscope : రాశి ఫలాలు..
ABN , First Publish Date - 2023-08-28T07:28:54+05:30 IST
వృషభం రాశివారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మిథునం రాశివారికి బీమా, పెన్షన్, గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తుల రాశివారికి చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా వుంటుంది.
నేడు (28-8-2023 - సోమవారం) వృషభం రాశివారు వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మిథునం రాశివారికి బీమా, పెన్షన్, గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. తుల రాశివారికి చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా వుంటుంది. వృశ్చికం రాశివారికి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఇక అన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు సన్నాహాలు చేస్తారు. సహోద్యోగులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గౌరవ పదవులు అందుకుంటారు. పైఅధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు. శివారాధన మేలు చేస్తుంది.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ప్రకటనలు, రవాణా, బోధన, రక్షణ, సృజనాత్మక రంగాల వారికి అనుకూలం. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించి ఒక సమాచారం ఆ వేదన కలిగిస్తుంది. శివాలయాన్ని దర్శించండి.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
బీమా, పెన్షన్, గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలో మార్పు వస్తుంది. రుద్రకవచపారాయణ మంచిది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
రాజకీయాలు, పబ్లిక్‌రిలేషన్స్, మేనేజ్‌మెంట్ రంగాల వారికి అనుకూలం. ఆర్థిక విషయాలకు సంబంఽధించిన చర్చలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల వైఖరి కొంత మనస్తాపం కలిగించే అవకాశం ఉంది. శి వాలయాన్ని దర్శించండి.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మెడికల్ క్లెయిములు పరిష్కారం అవుతాయి. ఫార్మా, ఆస్పత్రులు, హోటల్, కేటరింగ్ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు పూర్తవుతాయి. విద్యాసంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. శివాలయాన్ని దర్శించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా వుంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాదిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సినీ, రాజకీయ రంగాల వారు కొత్త ప్రాజెక్టు విషయంలో కొంత నిదానం పాటించాలి.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో అన్నదమ్ముల సహకారం అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్, బ్యాంకింగ్ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. రుద్రకవచ పారాయణ మేలు చేస్తుంది.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ, మన్ననలకు భంగం కలిగే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
రవాణా, రక్షణ, న్యాయ, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంతా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్యా విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో కుంటారు. న్యాయ వివాదాలు చికాకు కలిగిస్తాయి. గోమాత సేవ శుభం కలిగిస్తుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక ఇన్సూరెన్స్, మూచ్యువ ల్ ఫండ్ పెట్టుబడులు లాభిస్తాయి.
మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. షేర్‌మార్కెట్ లావాదేవీలకు అనుకూలం. జనసంబంధాలు మెరుగవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. భాగస్వామి వైఖరి కొంత ఆ వేదన కలిగిస్తుంది. రుద్రకవచ పారాయణ మేలు చేస్తుంది.
- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి