Horoscope : రాశి ఫలాలు..

ABN , First Publish Date - 2023-09-25T07:52:25+05:30 IST

నేడు (25-9-2023 - సోమవారం) మేషం రాశివారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శివారాధన మంచిది. వృషభం రాశివారికి వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం.

Horoscope : రాశి ఫలాలు..

నేడు (25-9-2023 - సోమవారం) మేషం రాశివారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శివారాధన మంచిది. వృషభం రాశివారికి వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. సింహం రాశివారు బృందకార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం అందుతుంది. ఇక అన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. బృంద కార్యాక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శివారాధన మంచిది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధు మిత్రులతో వేడుకలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. సంకల్పం నెరవేరుతుంది. రుద్ర కవచపారాయణ శుభప్రదం.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రియతములు, చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. షాపింగ్‌లో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీలోని ప్రతిభ కు గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాల గురించి ఆరాతీస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. బంధువుల రాకతో ఇల్లు సందడిగా వుంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. బదిలీలు, మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గోమాతను సేవించండి.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ఒక సమాచారం అందుతుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి మెయిల్స్‌, ఫోన్‌ సందేశాలు అందుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా వుంటుంది. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. రుద్రకవచ పారాయణ మంచిది.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కొత్త పనులు ప్రారంభిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. సినీ, రాజకీయ, న్యాయ, బోధన రంగాల వారికి అనుకూలం. దూరప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఉల్లాసం కలిగిస్తాయి. వినోదం, ఫొటోగ్రఫీ, రచనా రంగాల వారికి అనుకూలం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బ్యాంకులు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బృందకార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. గోమాత సేవ మేలు కలిగిస్తుంది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెద్దలతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ, మన్ననలు అందుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం. పెద్దల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

చర్చలు, ప్రయాణాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం. భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉత్సవాల్లో పాల్గొంటారు. శివారాధన మేలు చేస్తుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

పూజలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాష్టక పారాయణ మంచిది.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - 2023-09-25T08:04:23+05:30 IST