Horoscope : రాశిఫలాలు
ABN , First Publish Date - 2023-09-12T07:51:12+05:30 IST
నేడు (12-9-2023 - మంగళవారం) మేష రాశివారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారు లక్ష్యాలు సాధిస్తారు. మిథున రాశి వారు మార్కెటింగ్, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు.
నేడు (12-9-2023 - మంగళవారం) మేష రాశివారికి ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారు లక్ష్యాలు సాధిస్తారు. మిథున రాశి వారు మార్కెటింగ్, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఇక నేడు దాదాపు అన్ని రాశుల వారి ఫలితాలు బాగానే ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకటనలు, విద్యాసంస్థలు, ఫైనాన్స్ కంపెనీల వారు లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సృజనాత్మక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. గృహనిర్మాణ సామగ్రి, ఫర్నీచర్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ంటుంది. ప్రియతములను కలుసుకుంటారు. చిన్నారులకు వసతి ల భిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. సుబ్రహ్మణ్య స్వావుమి ఆరాధన శుభప్రదం
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
మార్కెటింగ్, రవాణా, బోదన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. చర్చలు, ప్రయాణాల్లో కొంత నిదానం అవసరం. విద్యార్థులు పట్టుదలతో శ్రమించి లక్ష్యాలు సాధిస్తారు. ఇంటికి అెసరమైన వస్తువుల రవాణాకు అనుకూలం. దుర్గామాత ఆరాధన మంచిది.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
బంధుమిత్రుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు, పొదుపు పథకాలపై చర్చలకు అనుకూలం. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. ఖర్చులు అధికం. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షాపింగ్ ఉ ల్లాసం కలిగిస్తుంది. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. పట్టుదలతో పని చేసి సంకల్పం సాధిస్తారు. గోసేవ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు, ఎగుమతులు, కన్సల్టెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరగా ఉంటుంది. రాజకీయాలు, సినిమాలు, టెక్స్టైల్స్, కళల రంగాల వారికి ఆర్థికంగా లాభిస్తుంది. లక్ష్య సాధనలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
వ్యాపారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం ల భిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖ ర్చు చేస్తారు. గోసేవ, గోవుకు ఆహారం అందించడం వల్ల మేలు కలుగుతుంది.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
వ్యాపార రంగంలోని వారికి ప్రోత్సాహకరమైన రోజు ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ప్రదర్శనలు, ఊరేగింపుల్లో పాల్గొంటారు. దుర్గామాత ఆలయాన్ని దర్శించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
వ్యాపార విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. ప్రింటింగ్, టెలివిజన్, న్యాయం, బోధన, కన్సల్టెన్సీ, రవాణా, రక్షణ రంగాల వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. సేవాకార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
పన్నులు, బీమా వ్యవహారాలపై దృష్టి పెడతారు. పెద్దల ఆ రోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బంధుమిత్రులను పరామర్శిస్తారు. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడుల విషయాలకు అనుకూలమైన రోజు సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త పరిచయాల వల్ల లబ్ధి పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
కొత్త పరిచయాలు ఉ ల్లాసం కలిగిస్తాయి. వ్యాపార రంగంలోని వారు లక్ష్యాలు సాధిస్తారు. పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.
- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ