Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-09-26T08:21:22+05:30 IST

నేడు (26-9-2023 - మంగళవారం) మేష రాశి వారికి షేర్‌ మార్కెట్‌ లావాదేవీలకు అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారు బీమా, పెన్షన్‌, గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సింహరాశి వారికి రాజకీయాలు, పబ్లిక్‌రిలేషన్స్‌, మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది.

Horoscope : రాశిఫలాలు

నేడు (26-9-2023 - మంగళవారం) మేష రాశి వారికి షేర్‌ మార్కెట్‌ లావాదేవీలకు అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారు బీమా, పెన్షన్‌, గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సింహరాశి వారికి రాజకీయాలు, పబ్లిక్‌రిలేషన్స్‌, మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. నేడు అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

షేర్‌ మార్కెట్‌ లావాదేవీలకు అనుకూలం. జనసంబంధాలు మెరుగవుతాయి. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. భాగస్వామి వైఖరి కొంత ఆవేదన కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మేలు చేస్తుంది.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గౌరవ పదవులు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విస్తరణకు సన్నాహాలు చేస్తారు. సహోద్యోగులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. పైఅధికారుల నుంచి మాటపడాల్సి రావచ్చు. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ప్రకటనలు, రవాణా, బోధన, రక్షణ, సృజనాత్మక రంగాల వారికి అనుకూలం. చిన్నారులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న ప్రియతములకు సంబంధించి ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బీమా, పెన్షన్‌, గృహరుణాల కోసం చేసే ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత కలవరపెడుతుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలో మార్పు వస్తుంది. సుబ్రహ్మణ్య అష్టక పారాయణ మంచిది.

MESHAM-05.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

రాజకీయాలు, పబ్లిక్‌రిలేషన్స్‌, మేనేజ్‌మెంట్‌ రంగాల వారికి అనుకూలం. ఆర్థిక విషయాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. శ్రీవారు, శ్రీమతితో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రుల వైఖరి కొంత మనస్తాపం కలిగించే అవకాశం ఉంది.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మెడికల్‌ క్లెయిములు పరిష్కారం అవుతాయి. ఫార్మా, ఆస్పత్రులు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్య సాధనకు అధికంగా శ్రమించాల్సి రావచ్చు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. చిట్‌ఫండ్‌లు, బ్యాంకులతో లావాదేవీలు పూర్తవుతాయి. విద్యాసంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

చికాకులు తొలగిపోయి మనసు ప్రశాంతంగా వుంటుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు గత అనుభవంతో లక్ష్యాలు సాదిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సినీ, రాజకీయ రంగాల వారు కొత్త ప్రాజెక్టు విషయంలో కొంత నిదానం పాటించాలి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

విలువైన పత్రాలు అందుకుంటారు. ఆర్థిక విషయాల్లో అన్నదమ్ముల సహకారం అందుకుంటారు. ఆర్థికపరమైన చర్చలు ఫలిస్తాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. ఆడిటింగ్‌, బ్యాంకింగ్‌ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరం. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ, మన్ననలకు భంగం కలిగే అవకాశం ఉంది.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

రవాణా, రక్షణ, న్యాయ, బోధన రంగాల వారికి ప్రోత్సాహకరంతా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత విద్యా విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో కుంటారు. న్యాయ వివాదాలు చికాకు కలిగిస్తాయి. గోమాత సేవ శుభం కలిగిస్తుంది.

MESHAM-FINAL-12.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. విలువైన వస్తువులు కోల్పోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక ఇన్సూరెన్స్‌, మూచ్యువ ల్‌ ఫండ్‌ పెట్టుబడులు లాభిస్తాయి.

- శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి

Updated Date - 2023-09-26T08:28:51+05:30 IST