Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-10-11T09:19:43+05:30 IST

నేడు (11-10-2023 - బుధవారం) క్రీడలు, పాఠశాలలు, టెలివిజన్‌, సృజనాత్మక రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, బ్యాంకుల రంగాల్లో ఉన్న సింహరాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Horoscope : రాశిఫలాలు

నేడు (11-10-2023 - బుధవారం) క్రీడలు, పాఠశాలలు, టెలివిజన్‌, సృజనాత్మక రంగాల్లో ఉన్న వృషభ రాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, బ్యాంకుల రంగాల్లో ఉన్న సింహరాశి వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక మీన రాశి వారికి ప్రత్యర్థుల నుంచి కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కేటరింగ్‌, సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సిబ్బంది నియామకాలకు అనుకూల సమయం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

క్రీడలు, పాఠశాలలు, టెలివిజన్‌, సృజనాత్మక రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియతముల విషయంలో శుభపరిణామాలు చోటుచే సుకుంటాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. రామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు మంచి ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఇల్లు సందడిగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్య సాధనలో కుటుంబ సభ్యుల సహకారం లోపిస్తుంది. గణపతి ఆరాధన మంచిది.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. రవాణా, స్టేషనరీ, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాల్లో నిదానం అవసరం.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఫైనాన్స్‌, చిట్‌ఫండ్‌లు, బ్యాంకుల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రుణప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన పత్రాలు అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. బంగారం, ఆభరణాలు, వడ్డీ వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో కొత్త ఆలోచనలు చేస్తారు. చొరవ, నైపుణ్యం, భిన్నమైన ఆలోచనలతో పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. సకాలంలో నిధులు సర్దుబాటు కాకపోవడంతో కొంత ఇబ్బంది పడతారు.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. సినిమాలు, రాజకీయాలు, కన్సల్టెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. శివారాధన శుభప్రదం.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బృంద కార్యక్రమాలు ఆనందం కలిగిస్తాయి. షేర్‌మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. సమావేశాల్లో కొన్ని చిక్కులు ఎదురయ్యే అ వకాశం ఉంది.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారరంగంలోని వారికి మెరుగైన అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. శివారాధన మంచిది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వీసా, పాస్‌పోర్ట్‌ పనులకు అనుకూలం. విద్యార్థులు సత్ఫలితాలు సాధిస్తారు. రవాణా, బోధన, పోలీస్‌, న్యాయ, ఆడిటింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురవతాయి. పరమశివుడిని ఆరాధించండి.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్‌ ఉ ల్లాసం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల కోసం ఖ ర్చు చేస్తారు. షేర్‌మార్కెట్‌, మ్యూచ్యువల్‌ ఫండ్‌లో పెట్టుబడులకు అనుకూలం. పెన్షన్‌, బీమా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తాయి. స్టాక్‌మార్కెట్‌ లావాదేవీలు లాభిస్తాయి. ప్రత్యర్థుల నుంచి కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-10-11T09:37:01+05:30 IST