#RIPTarakaRatna TarakaRatna Live Updates: తారకరత్న భౌతికకాయాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చిన నందమూరి బాలకృష్ణ

ABN , First Publish Date - 2023-02-19T06:13:51+05:30 IST

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన..

#RIPTarakaRatna TarakaRatna Live Updates: తారకరత్న భౌతికకాయాన్ని చూసి గుండె పగిలేలా ఏడ్చిన నందమూరి బాలకృష్ణ

06:00 PM: అస్వస్థతకు గురైన తారకరత్న భార్య

* శనివారం సాయంత్రం నుంచి ఏమీ తినకుండా ఉన్న తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి

* దీంతో పూర్తిగా నిరసించిపోయిన అలేఖ్య రెడ్డి

* అలేఖ్య రెడ్డిని ఆసుపత్రిలో చేర్చే యోచనలో కుటుంబ సభ్యులు

Alekhya-Reddy.jpg

05:30 PM: తారకరత్న భౌతికకాయం వద్ద అన్నీ తానై వ్యవహరిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఆదివారం ఉదయం నుంచి అక్కడే..

Vijayasai-Reddy.jpg

cbn-vs1.jpg

jr-ntr.jpgabn12.jpg

05:00 PM: బాలయ్యతో తన బాధను చెప్పుకున్న తారకరత్న భార్య అలేఖ్య

Balakrishna1.jpg

04:30 PM: తారకరత్న భౌతికకాయాన్ని చూసి చిన్నపిల్లాడిలా గుండె పగిలేలా ఏడ్చిన నందమూరి బాలకృష్ణ

Balakrishna.jpg

04:00 PM: తారకరత్నకు నివాళులు అర్పించిన ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని

kodalinani.jpg

03:30 PM: తారకరత్న భౌతికంగా దూరం కావడంపై దగ్గుబాటి పురంధేశ్వరి భావోద్వేగ ట్వీట్..

D-Purandeswari.jpg

03:00 PM: చివరి నివాళి

మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా నందమూరి తారకరత్న రామగిరి మండలంలోని వెంకటాపురంలో జనవరి 24న నివాళులు అర్పించారు. వారి ఇంటికి వెళ్లి పరిటాల శ్రీరామ్‌, పరిటాల సిద్థార్థతో ముచ్చటించారు. నందమూరి కుటుంబం, పరిటాల కుటుంబం వేరువేరు కాదని ఈ సందర్భంగా తారకరత్న అన్నారు. పరిటాల రవీంద్ర తనకు సోదరసమానుడని అన్నారు. ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినిమా షూటింగ్‌ కోసం జిల్లాకు వచ్చిన సమయంలో కలిసి భోజనం చేసేవారని అన్నారు. రామగిరి మండలంలో గాలిమరల వద్ద తారకరత్న ‘మగాడు’ సినిమా షూటింగ్‌లో దాదాపు 22 రోజులపాటు పాల్గొన్నారు. వెంకటాపురం నుంచి హిందూపురం వెళుతూ, తన అభిమాని అవుకు హరి ఆహ్వానం మేరకు చెన్నేకొత్తపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి తేనీరు స్వీకరించారు. హరి, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు తారకరత్నను శాలువాతో సత్కరించారు. తమ అభిమాన నటుడు లేడని తెలుసుకుని, ఈ ప్రాంతవాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

FpQ0lkwaEAE0nRO.jpg

02:30 PM: సినీ నటుడు తారకరత్న (Taraka Ratna) ఇక లేరని తెలుసుకుని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆయన అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. జిల్లాలో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 2007లో గుంతకల్లు పట్టణంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు. అనంతపురం నగరంలోని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గౌస్‌మొద్దీన్‌ ఇంటికి తారకరత్న దాదాపు ఆరుసార్లు వచ్చారు. గత సార్వత్రి ఎన్నికల్లో తన హిందూపురంలో కొన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేశారు. హిందూపురంలో టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ కూతురు వివాహానికి జనవరి 26న తారకరత్న హాజరయ్యారు. లోకేష్‌ పాద యాత్రకు వెళ్తూ కర్ణాటక రాష్ట్రం నందిహిల్స్‌ వద్ద హిందూపురం నుంచి వెంట వెళ్లిన అభిమానులతో కలిసి భోజనం చేశారు.

FpTK8quaUAAz1lV.jpg

01:45 PM: అభిమానుల సందర్శనార్థం తారకరత్న పార్థీవ దేహాన్ని సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు ఫిల్మ్ ఛాంబర్‌కి తరలించనున్నారు. 3 గంటలకు అంతిమయాత్ర మొదలై.. 3.30 నిమిషాలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

01:05 PM: తారకరత్నకు నారా కుటుంబం నివాళి.. ఫొటోల కోసం క్లిక్ చేయండి..

FpUBNWEaYAAb5zS.jpgWhatsApp Image 2023-02-19 at 1.02.10 PM.jpeg

12:55 PM: తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డి ఎవరంటే..

Taraka-Ratna-Wife.jpg



12:45 PM: తారకరత్న భౌతికకాయం వద్ద నారా లోకేష్ దంపతుల శ్రద్ధాంజలి

Untitled-6.jpg

Untitled-5.jpg

12:25 PM: తారకరత్న నివాసం వద్ద ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలో తారకరత్న తనదైన మార్క్‌ సృష్టించారని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతున్నంతసేపు విజయసాయి రెడ్డి పక్కనే నిలుచున్నారు.

Untitled-4.jpg

11:56 AM: తారకరత్నకు నివాళులు అర్పించిన నారా లోకేశ్, సతీమణి బ్రాహ్మణి

Untitled-3.jpg

11:40 AM: తారకరత్నకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుకున్న విజయసాయి, టీడీపీ అధినేత చంద్రబాబు

CBN-Vijayasai-Reddy.jpg

10:45 AM: తారకరత్న నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు

cbn.jpg

10:35 AM: అల్లు అర్జున్ సంతాపం..

‘తారకరత్న గారి మరణ వార్త విని చాలా బాధ పడ్డాను. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

10:15 AM: నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం

తారకరత్న మరణవార్త కలిచివేసింది: ప్రధాని మోదీ

సినీ ఇండస్ట్రీలో తారకరత్న తనదైన మార్క్‌ సృష్టించారు

తారకరత్న కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: మోదీ

modi.jpg

10:00 AM: తారకరత్న భౌతికకాయానికి జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులు

abn12.jpg

09:00 AM: మోకిలలోని నివాసంలో తారకరత్న భౌతికకాయం

* తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించిన విజయసాయిరెడ్డి

jr-ntr.jpg

08:33 AM: తండ్రి భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తారకరత్న కుమార్తె నిషిక

abn.jpgabn1.jpg

08:30 AM: స్వగృహానికి చేరుకున్న నందమూరి తారకరత్న భౌతికకాయం

abn2.jpg

08:00 AM: తారకరత్న మృతికి సంతాపంగా ప్రకటన విడుదల చేసిన నందమూరి తారకరత్న అభిమానుల సంఘం

FpS8R8eaEAEygg9.jfif

07:40 AM: తారకరత్న దూరం కావడంతో టీడీపీ యువనేత నారా లోకేష్ ఎంత భావోద్వేగ ట్వీట్ చేశారంటే..

02588bef-dad5-411d-b32a-898ab3ee248f.jfif

07:30 AM: బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తారకరత్న మృతదేహం తరలింపు. హాస్పిటల్‌ వెనుక గేటు నుంచి అంబులెన్స్‌లో తరలింపు. హైదరాబాద్‌కు తారకరత్న భౌతికకాయం. బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని మోకిలలోని నివాసానికి తరలింపు. అభిమానుల సందర్శనార్థం రేపు తెలుగు ఫిలిం చాంబర్‌లో భౌతికకాయం. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు ఫిలిం చాంబర్‌లో తారకరత్న భౌతికకాయం. రేపు సాయంత్రం 5 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు.

01 (1).jpg

07:00 AM:

* జనవరి 27న లోకేష్‌ పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న

* లోకేష్‌ పాదయాత్ర మొదటి రోజు గుండెపోటుతో కుప్పకూలిన తారకరత్న

* జనవరి 28న బెంగళూరు హృదయాలయ ఆస్పత్రికి తరలింపు

* నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ కన్నుమూత

* తారకరత్న తండ్రి మోహనకృష్ణ, తాత ఎన్టీఆర్‌

* తారకరత్న భార్య అలేఖ్య, కూతురు నిషిక

* 1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్న

* 2002లో నందమూరి వారసుడుగా సినీరంగ ప్రవేశం చేసిన తారకరత్న

* ఒకేసారి 9 సినిమాలు మొదలుపెట్టి వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన తారకరత్న

* ఒకటో నెంబర్‌ కుర్రాడు, యువరత్న, తారక్‌, భద్రాద్రి రాముడు, విజేత..

* అమరావతి, నందీశ్వరుడు, ఎదురు లేని అలెగ్జాండర్‌, మహా భక్త సిరియాళ..

* కాకతీయుడు, ఎవరు, మనమంతా, దేవినేని, సారథి చిత్రాల్లో నటించిన తారక్‌

* హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా 23 చిత్రాల్లో నటించిన తారకరత్న

* 2009లో అమరావతి చిత్రానికి ఉత్తమ విలన్‌గా తారకరత్నకు నంది అవార్డు

* షూటింగ్ దశలో ఉన్న రెండు చిత్రాలు.. రిలీజ్‌కు రెడీగా ఉన్న మిస్టర్ తారక్

* గతేడాది '9 hours' అనే వెబ్‌సిరీస్‌లో నటించిన తారకరత్న

01 (13).jpg

06:30 AM: నేడు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు నారా లోకేష్. తారకరత్నకు నివాళులర్పించనున్న టీడీపీ యువనేత. సోమవారం నాడు తారకరత్న అంత్యక్రియలు

FnsQ3xnacAE-HqK.jpg

06:15 AM: ప్రముఖుల సంతాపం..

నందమూరి తారకరత్న మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తారకరత్న మరణవార్త తీవ్ర దిగ్ర్భాంతిని, బాధను కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయనను బతికించుకునేందుకు చేసిన ప్రయత్నాలు, కుటుంబసభ్యులు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదని విచారం వ్యక్తం చేశారు. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి దూరమై.. తమ కుటుంబానికి విషాదం మిగిల్చారన్నారు. తారకరత్న మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. కాగా, తారకరత్న కోలుకుంటారని భావించానని, కానీ.. మృతి చెందడం బాధాకరమని జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నానన్నారు. ‘బావా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు... నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది... నందమూరి తారకరత్న మృతి దిగ్ర్భాంతికి గురి చేసింది’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.

FpQ-bf9WIAE7Gda.jpg

‘‘తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు... నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహబంధం మన బంధుత్వం కంటే గొప్పది... తారకరత్నకు కన్నీటి నివాళులు’’ అని ఆయన పేర్కొన్నారు. తారకరత్న మృతి పట్ల ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్‌ ముదిరాజ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యతు ఉన్న తారకతర్న చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన మరణం ఎన్టీఆర్‌ కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని పేర్కొన్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు.. తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

06:10 AM: టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి 11గంటలకు తారకరత్న పార్థివదేహాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌ నగర శివార్లలోని మోకిలలో ఉన్న ఆయన స్వగృహానికి అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం అక్కడే ఉంచి సోమవారం ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌ కార్యాలయం వద్ద ప్రజల సందర్శనార్థం ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

FpQ5Rf_aQAEVSeK.jpg

06:00 AM: గుండెపోటుకు గురైన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు 45 నిమిషాలు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.సంబంధిత నిపుణులు చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రముఖ న్యూరాలజిస్ట్‌, విదేశీ వైద్యుల సలహాలు తీసుకుని చికిత్స కొనసాగించారు. గత రెండు రోజులుగా తారకరత్న ఆరోగ్యం జటిలమైనట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత వెంటిలేటర్‌ తొలగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్‌ తరలిస్తారంటూ శనివారం ప్రచారం సాగింది. కానీ, అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 23రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకు కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు శనివారం రాత్రి ప్రకటించాయి. ఆయనకు మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలు అంతకుముందునుంచీ ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అందువల్లే పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొంత ఒత్తిడికిలోనై తారకరత్న గుండెపోటుకు గురయ్యారని పేర్కొన్నాయి. కాగా, తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, కుమార్తె నిషిక తొలిరోజు నుంచే ఆస్పత్రిలోనే ఉన్నారు.

FpQ_-x1acAAn5X5.jpg

ప్రముఖ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి తారకరత్న(40) శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో కన్నుమూశారు. టీడీపీ యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన.. అక్కడ గుండెపోటుకు గురై తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. జనం మధ్యనే ఒక్కసారిగా కుప్పకూలిన తారకరత్నను పార్టీ కార్యకర్తలు వెంటనే కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి గ్రీన్‌ చానల్‌ ద్వారా ఆయన్ను బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.


నాన్నను నిర్జీవంగా చూడలేక తారకరత్న కూతురు కన్నీరుమున్నీరు...

తండ్రి భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తారకరత్న కుమార్తె నిషిక.. వీడియో చూడండి..

Updated Date - 2023-02-19T18:08:22+05:30 IST